Diabetic eye disease: ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ కూడా ఒకటి. సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, ఇతర కారణాల వల్ల డయాబెటిస్ బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. 30 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో ఎక్కువమంది డయాబెటిస్ తో బాధ పడుతున్నారు. డయాబెటిస్ నిర్ధారణ అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
డయాబెటిస్ బారిన పడిన వాళ్లు తీపి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. జీవనశైలిని మార్చుకోవడం మినహా షుగర్ ను పూర్తిస్థాయిలో తగ్గించడం సాధ్యం కాదు. డయాబెటిస్ వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతే ఇన్సులిన్ తక్కువగా విడుదలై శరీరంలోని వేర్వేరు అవయవాలు దెబ్బ తినే అవకాశాలు కూడా ఉంటాయి. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లలో కంటిచూపు మందగిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళలను ఎక్కువగా ఈ సమస్య వేధిస్తుంది.
డయాబెటిక్ టైప్1, టైప్2తో బాధ పడే వాళ్లలో 25 శాతం మందిలో కంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ సమస్య వల్ల కంటిచూపు పోయే అవకాశం కూడా ఉంటుంది. కంటిశుక్లం, గ్లాకోమా, డయాబెటిక్ మాక్యులర్ ఎడీమా లాంటి సమస్యలు సైతం డయాబెటిస్ ఉన్నవాళ్లను వేధించే అవకాశాలు ఉంటాయి. మధుమేహంతో బాధ పడేవాళ్లు తప్పనిసరిగా చక్కెర స్థాయిలను నియంత్రించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
సిగరెట్, బీడీ, తంబాకు అలవాట్లు ఉంటే ఆ అలవాట్లకు పూర్తిగా దూరం కావాలి. ఫైబర్, ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారైనా కంటి పరీక్షలు చేయించుకుని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెట్టుకుంటే కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.