Dengue Fever: సాధారణంగా చలికాలం వచ్చిందంటే ఎక్కువగా దోమల వ్యాప్తి కూడా ఉంటుంది. దోమలు అధికంగా ఉండటం వల్ల ఎక్కువగా వైరల్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలోనే మలేరియా టైఫాయిడ్ , డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతాయి. జూలై నుంచి డిసెంబర్ వరకు ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు పాటించకపోతే ఈ జ్వరాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Also Read: నిర్లక్ష్యానికి ‘ఒమిక్రాన్’ మూల్యం
ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో టైగర్ దోమల వల్ల డెంగ్యూ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ దోమల ప్రభావం రాత్రి పగలు అధికంగా ఉంటుంది కనుక పిల్లలను దోమల నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఇకపోతే డెంగ్యూ జ్వరాన్ని ముందుగా గ్రహించి సరైన చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు పిల్లలలో ఎక్కువగా నొప్పులు, అధిక జ్వరం, వాంతులు అవడం వంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ లక్షణాలు కనబడితే వెంటనే పిల్లలకు రక్తపరీక్షలు చేయించి నిర్ధారణ చేసుకోవాలి.
ఈ కాలంలో దోమల ప్రభావం అధికంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు మన ఇంటిలోనూ, ఇంటి పరిసరాలలో నీరు నిలువకుండా చూసుకోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా కొబ్బరిబొండాలు, టైర్లు, పూల కుండీలలో నీరు నిలువకుండా చూసుకోవడం వల్ల దోమల ప్రభావం తగ్గుతుంది. ఇకపోతే వీలైనంత వరకు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ విధమైనటువంటి విష జ్వరాల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా డెంగీ జ్వరం వచ్చినప్పుడు శరీరం మొత్తం నొప్పులు రావడంతో ఈ జ్వరాన్ని బోన్ బ్రేక్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. కనుక పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
Also Read: విచ్చలవిడి యాంటీ బయాటిక్స్‌తో చాలా ప్రమాదం.. హెచ్చరిస్తున్న వైద్యులు?