Homeహెల్త్‌Daytime Naps Benefits : పగటి పూట ఓ అరగంట నిద్రపోతే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు...

Daytime Naps Benefits : పగటి పూట ఓ అరగంట నిద్రపోతే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?

Daytime Naps Benefits :పగటి పూట కాసేపు కునుకు తీయడం చాలా మందికి అలవాటు. పగటి పూట నిద్ర కేవలం అలవాటు మాత్రమే కాదు. శరీర శ్రేయస్సులు ఎంతో మేలు చేస్తుందట. పగటి పూట కనీసం 30నిమిషాల నిద్ర పోతే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ‘జర్నల్ ఆఫ్ అమెరికా హార్ట్ సర్వే’లో వెల్లడైంది. థైరాయిడ్‌, డయాబెటిస్, ఒబెసిటీ వంటి సమస్యలు అదుపులో ఉంటాయని పేర్కొంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తెలిపింది. ఉద్యోగస్థులకు పని ఒత్తిడి తగ్గి మానసికంగా కొత్త ఉత్సాహం వస్తుందని వెల్లడించింది. శరీరం అలసటగా ఉంటే 30నిమిషాల నిద్రతో రిఫ్రెష్ కావచ్చని సర్వేలో తేలింది. పగతి పూట నిద్ర మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, శారీరక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందట. ఇది చిన్నపిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు కూడా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలను అందజేస్తుంది.

Also Read : వెలుతురు లేదా చీకటి ఎందులో పడుకుంటే ప్రయోజనాలో మీకు తెలుసా?

చాలామంది పగటిపూట నిద్రపోతే ఆరోగ్యానికి లాభాల కంటే నష్టాలు ఎక్కువగా కలుగుతాయని ఫీలవుతారు. అయితే పగటిపూట నిద్రపోవడం ద్వారా కూడా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ‘జర్నల్ ఆఫ్ అమెరికా హార్ట్ సర్వే’తో పాటు సర్వేల ద్వారా ఈ విషయం వెల్లడైంది. పగటి నిద్ర వల్ల శరీరానికి అవసరమైన శక్తిని అందజేస్తుంది. శరీరానికి మెదడుకు అవసరమైన రీఛార్జ్ ను అందించడంలో పగటి పూట కునుకు ఎంతగానో దోహదపడుతుంది.

కొంత సమయం అలా పగటి పూట నిద్రపోవడం వల్ల చేసే పనులపై దృష్టి పెరిగే ఛాన్సులు ఉంటాయట. మెదడు పనితీరును మెరుగుపరుస్తుందట. పగటి పూట నిద్ర వల్ల సెరటోనిన్ ఉత్పత్తి కావడంతో పాటు ఇరిటేషన్ తగ్గే అవకాశాలు ఉంటాయని సర్వేలో పేర్కొన్నారు. పగటి నిద్ర వల్ల ఆందోళన తరహా సమస్యలను సైతం దూరం చేసుకునే అవకాశం ఉంటుందట.

బీపీ సమస్యతో బాధ పడేవారు పగటి పూట కాసేపు కునుకు తీయడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుందట. పగటి పూట నిద్ర గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్ల పగటి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలట. పగటి నిద్ర రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుందని చెప్పవచ్చు.

అంతేకాకుండా మధ్యాహ్నం నిద్రపోతే మొటిమలు కూడా రావట. పగటి పూట కునుకుతో … పగటి నిద్రపోవడం వల్ల శక్తి, మానసిక ఆరోగ్యం, పనితీరు, అభ్యాస సామర్థ్యం కూడా పెరుగుతుందట. కాకపోతే ఎక్కువగా నిద్రపోవడం వల్ల అనారోగ్యం, మరణాల ప్రమాదం కూడా పెరుగుతుందట.

Also Read : హాయిగా నిద్రపట్టాలంటే.. ఈ పండ్లు తినండి

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular