Sleeping : ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లేదా మారిన జీవనశైలి వల్ల చాలామంది సరిగ్గా నిద్రపోవడం లేదు. మనిషికి తిండి, నీరు ఎంత ముఖ్యమూ నిద్ర కూడా అంతే ముఖ్యం. తిండి లేకపోయిన కొన్ని రోజులు బ్రతకగలరు ఏమో.. కానీ నిద్ర లేకపోతే బ్రతకలేరు. ఒక్క రోజు నిద్ర తక్కువైన మనిషి చాలా నీరసంగా అయిపోతారు. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఈరోజుల్లో అయితే ఎక్కువగా సోషల్ మీడియాకు బానిస అయ్యి.. పగలు, రాత్రి తేడా లేకుండా వాడుతున్నారు. మొబైల్ నుంచి వచ్చే ఆ కిరణాల వల్ల తొందరగా నిద్ర పట్టదు. దీనివల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్లు మూసిన వెంటనే నిద్ర పట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలేంటో ఈరోజు తెలుసుకుందాం.
నిద్ర పట్టాలంటే ఫుల్‌గా తినాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. అలాగే ఉదయం పూట ఎక్కువగా ఆహారం తీసుకుని.. రాత్రిపూట కొంచెం తక్కువగా తీసుకోవాలి. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగాలి. పాలు తాగడం ఇష్టం లేని వాళ్లు గోరువెచ్చని నీరు తాగాలి. ఇలా తాగి పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. వేడి నీరు కంటే పాలు మంచివి. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్, సెరోటోనిన్ హాయిగా నిద్రపోవడానికి సాయపడుతుంది. కాబట్టి పాలు తాగడం అలవాటు చేసుకోండి. అలాగే నిద్రపోయే ముందు చెర్రీ జ్యూస్ లేదా ఏదైనా పండ్ల జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల బాగా నిద్రపడుతుంది. వీటితో డ్రైఫూట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు, కివీ పండ్లు, బెర్రీస్, దానిమ్మ వంటివి తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవడంతో పాటు మానసికంగా సంతోషంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలి. ఎక్కువగా టెన్షన్ తీసుకున్నా కూడా హాయిగా పడుకోలేరు.
బయట ఫుడ్ తినడం తగ్గించాలి. ప్రాసెస్ చేసిన ఆహారం, వేపుళ్లు, బర్గర్‌లు, కొవ్వులు, వైట్ బ్రెడ్, పాస్తా, కెఫిన్ ఉండే పదార్థాలు, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. రాత్రిపూట భోజనం లేటుగా చేయకుండా తొందరగా చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రి పూట మితంగా మాత్రమే ఆహారం తీసుకోవాలి. అధికంగా ఫుడ్ తీసుకోకూడదు. అలాగే శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా నిద్రపట్టదు. కాబట్టి వ్యాయామం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రపోయే గంట ముందు మొబైల్, కంప్యూటర్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండండి. వీటి నుంచి వచ్చే కిరణాల వల్ల తొందరగా నిద్రపట్టదు. అలాగే కళ్లు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. నిద్రపోయే ముందు పాటలు లేదా స్టోరీలు వినడం, పుస్తకాలు చదవడం వంటివి చేస్తే తొందరగా నిద్రపడుతుంది. కళ్లు మూసిన పది నిమిషాల్లో హాయిగా నిద్రపోవచ్చు.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Eat these fruits to sleep comfortably
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com