Date Palm: ఖర్జూరాలు అంటే చాలా మందికి ఇష్టం. వీటి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ప్యాకెట్స్ లో తీసుకుంటే రూ. 10 కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక కిలో తీసుకున్నా కూడా కాస్త తక్కువ రేటు ఉంటుంది కాబట్టి చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఈ ఖర్జూరాలను డేట్స్ అని పిలుస్తారు.. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అయితే మనలో ప్రతి ఒక్కరూ ఖర్జూర పండును తినేసి దాని విత్తనాలను పనికిరావని పారేస్తుంటారు. కానీ ఈ గింజలు కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఖర్జూరంలో ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి-6 అధికంగా ఉంటాయి. శరీరంలో ఐరన్ కంటెంట్ పెరగడం నుంచి రక్త ఉత్పత్తిని ఉత్తేజపరిచే వరకు, ఖర్జూరాలు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఖర్జూరంలో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. అయితే ఈ ఖర్జూరాలు తిని గింజలను ఉమ్మేస్తుంటారు కదా. కానీ అలా చేయకుండా వాటిని ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే?
ఖర్జూరం గింజలతో కాఫీని తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఖర్జూరాలను ఎండబెట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీన్ని నీళ్లలో నానబెట్టి మళ్లీ ఎండబెట్టి ఖర్జూరం సిరప్ దాల్చిన చెక్క, యాలకుల పొడి, వేసి ఆ తర్వాత వాటికి వేడి పాలు కలిపి కాఫీని తయారుచేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు.
ఖర్జూర గింజలను బాడీ స్క్రబ్ గా ఉపగించవచ్చు. ఈ బాడీ స్క్రబ్ వల్ల మీ శరీరంలోని మృతకణాలు తొలిగిపోతాయి. ఇందుకోసం ఖర్జూరం గింజలను పొడిగా చేసుకోవాలి. అందులో కావాల్సినంత మేర పెరుగును వేసి చిక్కటి పేస్ట్ లా చేసుకోవాలి.. దీన్ని శరీరానికి అప్లై చేసి స్క్రబ్ చేయండి.
కోకో పౌడర్ ను ఉపయోగించే వారు దాని ప్లేస్ లో బేకింగ్ ఖర్జూర గింజలను ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా మాత్రం ఉపయోగించకూడదు. లిమిట్ లో ఉపయోగించాలి. దీని వల్ల ఎలాంటి హాని జరగదు. ఖర్జూరం గింజలను మొక్కలకు కంపోస్ట్ కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఖర్జూరం గింజలను పగులగొట్టి పొడి చేయండి. దీన్ని మట్టిలో కలపండి. దీన్ని మొక్కలకు ఎరువుగా వేస్తుంటారు కూడా. ఈ ఎరువు వల్ల మంచి పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఖర్జూరం గింజలను వేయించి జంతువులకు ఆహారంగా కూడా ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలు గేదెలు, ఆవులు, గుర్రాలకు మేతగా కూడా వేయవచ్చు. వీటిని తింటే జంతువులకు ఎదుగుదల బాగుంటుంది అంటున్నారు నిపుణులు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..