https://oktelugu.com/

జగన్ కు బీజేపీ భారీ షాక్.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి ఫిర్యాదు

గత చంద్రబాబు ప్రభుత్వమే 2 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసింది. ఇప్పుడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీల కోసం ‘నవరత్నాల’ పేరుతో ప్రజలకు సంక్షేమం అందించేందుకు మరింత అప్పులు చేశాడు. ఫలితం అప్పటికే ముక్కీ మూలుగుతున్న ఏపీ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైంది. ఇప్పుడు ఆర్థిక పతనం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మాట అన్నది ఎవరో కాదు.. జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న కేంద్రంలోని బీజేపీ మిత్రులే కావడం ఇక్కడ సంచలనం. Also Read: బస్తీల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 3, 2020 / 09:25 AM IST
    Follow us on

    గత చంద్రబాబు ప్రభుత్వమే 2 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసింది. ఇప్పుడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీల కోసం ‘నవరత్నాల’ పేరుతో ప్రజలకు సంక్షేమం అందించేందుకు మరింత అప్పులు చేశాడు. ఫలితం అప్పటికే ముక్కీ మూలుగుతున్న ఏపీ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైంది. ఇప్పుడు ఆర్థిక పతనం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మాట అన్నది ఎవరో కాదు.. జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న కేంద్రంలోని బీజేపీ మిత్రులే కావడం ఇక్కడ సంచలనం.

    Also Read: బస్తీల్లో అధికశాతం ఓటింగ్ దేనికి సంకేతం?

    కేంద్ర సర్కార్ ఏపీలోని జగన్ సర్కార్ కు భారీ షాక్ ఇచ్చింది. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు తాజాగా బాంబు పేల్చారు. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అటు ఇటుగా ఉన్న ఏపీ ఆర్థికపరిస్థితి.. జగన్ పందేరాలతో మరింత దిగజారే ప్రమాదంలో పడిందని.. వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

    జగన్ సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కు బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు బుధవారం లేఖలు రాశారు.

    ఇటీవల 56 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్.. వాటి నిధులను సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నారని.. ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి మరీ సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని సురేష్ ప్రభు లేఖలో పేర్కొన్నారు.

    Also Read: వరదసాయం టీఆర్ఎస్ ను గట్టెక్కించేనా?

    ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ నరేశ్ కుమార్ నుంచి తనకు లేఖ వచ్చిందని.. అందులోని విషయాలు నిజమని తెలిసిన తర్వాతే కేంద్రానికి లేఖ రాస్తున్నాని సురేష్ ప్రభు తెలిపారు.

    ఈ పరిణామం ఏపీలోని జగన్ సర్కార్ కు మింగుడు పడడం లేదు. రాజధాని లేని రాష్ట్రం.. కేంద్రంలో ప్రతిదానికి బీజేపీకి సపోర్టు చేస్తున్న జగన్ కు వ్యతిరేకంగా కేంద్రంలో పరిణామాలు జరగడం వైసీపీ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. కనీసం కేంద్రం నిధులు ఇవ్వకపోగా.. అప్పులు తెస్తూ నెట్టుకొస్తుంటే దాన్ని కూడా పరువు తీసేలా చేస్తున్న వైనంపై కేంద్రం ఇలా లీకులు ఇచ్చి అభాసుపాలు చేస్తోందన్న ఆవేదన వైసీపీ వర్గాల్లో ఉంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్