https://oktelugu.com/

ఆపిల్ తింటే డయాబెటిస్ వచ్చే ఛాన్స్ తక్కువ.. ఈ బెనిఫిట్స్ కూడా?

వైద్యులలో చాలామంది రోజుకో ఆపిల్ ను తినాలని సూచిస్తూ ఉంటారు. అనేక వ్యాధులకు చెక్ పెట్టడంలో ఆపిల్ ఎంతగానో సహాయపడుతుంది. అనేక వ్యాధుల ముప్పును తగ్గించడంలో ఆపిల్ ఎంతగానో తోడ్పడుతుంది. ఆపిల్ వ్యాధి పోరాట మూలకాలను కలిగి ఉండటంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటుంది. డయాబెటిస్ బారిన పడకుండా చేయడంలో ఆపిల్ ఎంతగానో సహాయపడుతుంది. యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్‌ పరిశోధనల ప్రకారం ఆపిల్ ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఆపిల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 8, 2021 9:21 pm
    Follow us on

    వైద్యులలో చాలామంది రోజుకో ఆపిల్ ను తినాలని సూచిస్తూ ఉంటారు. అనేక వ్యాధులకు చెక్ పెట్టడంలో ఆపిల్ ఎంతగానో సహాయపడుతుంది. అనేక వ్యాధుల ముప్పును తగ్గించడంలో ఆపిల్ ఎంతగానో తోడ్పడుతుంది. ఆపిల్ వ్యాధి పోరాట మూలకాలను కలిగి ఉండటంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటుంది. డయాబెటిస్ బారిన పడకుండా చేయడంలో ఆపిల్ ఎంతగానో సహాయపడుతుంది.

    యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్‌ పరిశోధనల ప్రకారం ఆపిల్ ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఆపిల్ పండ్లలో ఉండే పాలీఫెనాల్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. ఫైబర్, వాటర్ కంటెంట్ ఆపిల్ లో ఉండటం వల్ల ఆపిల్ తింటే త్వరగా కడుపు నిండుతుంది. ఆహారం తినే ముందు ఆపిల్ తింటే వాళ్లు 200 కేలరీల ఆహారం తక్కువ తీసుకుంటారని తెలుస్తోంది.

    గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఆపిల్ తోడ్పడుతుంది. కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఆపిల్ ఎంతగానో సహాయపడుతుంది. ఫ్లేవనాయిడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటుతో పాటు గుండె స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రోజుకో ఆపిల్ తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని 28 శాతం వరకు తగ్గించవచ్చు. బీటా కణాల కణజాలాన్ని దెబ్బతినకుండా చేయడంలో ఆపిల్ తోడ్పడుతుంది.

    ఆపిల్ ఆస్తమా ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు ఆపిల్ తొక్కలో ఉండే ఫ్లేవనాయిడ్ క్వెర్సెటిన్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రధాన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఆపిల్ ఎంతగానో సహాయపడుతుంది.