https://oktelugu.com/

Father’s Day : నాన్న.. నీ మనసు వెన్న.. అసలు ఏంటి ఫాదర్స్ డే.. దాని ప్రత్యేకత ఏంటి?

మనకు వచ్చే కష్టాలను ఎదుర్కోవడమెలాగని సలహాలు ఇస్తుంటాడు. ఇలా నాన్న మన జీవితంలో ఎంతో స్పెషల్ అని గుర్తించుకోవడం సహజమే. నాన్నకు ఫాదర్స్ డే సందర్భంగా ఓ మిలియన్ శక్తుల వందనం.  

Written By:
  • Srinivas
  • , Updated On : June 18, 2023 12:43 pm
    Follow us on

    Father’s Day : సృష్టిలో అమ్మ తన పేగు పంచితే నాన్న ప్రేమ పంచుతాడు. తన జీవితాన్ని పిల్లల కోసం కేటాయిస్తాడు. నాన్న కష్టపడే ప్రతి క్షణం కూడా పిల్లల కోసమే. తమ బిడ్డలు కష్టపడకూడదని ఆలోచిస్తాడు. ఇందులో భాగంగానే మంచి చదువు చెప్పించడానికి తన రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. మనం ఎదిగేందుకు తన సర్వస్వాన్ని పణంగా పెడతాడు. అందుకే సృష్టిలో అమ్మ తరువాత నాన్నే ప్రత్యేకం. అందుకే ఫాదర్స్ డే సందర్భంగా ఆయనను ఓ సారి గుర్తు చేసుకుందాం.

    నాన్నే సర్వస్వం

    మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ అంటారు. తల్లిదండ్రులు, గురువు దైవంతో సమానం. అమ్మ జన్మనిస్తుంది. నాన్న అన్ని ఇస్తాడు. మన బతుకుకు కావాల్సిన అన్నింటిని సమకూర్చడంలో తండ్రి పాత్రే ఎంతో విలువైనది. పిల్లలకు ఏం కావాలో అన్ని సమకూర్చడం తండ్రి వంతు. కన్నందుకు పిల్లలను కంటికి రెప్పలా కాపాడటంలో తల్లిదండ్రుల తరువాతే ఎవరైనా. అలా మన జీవితంలో ఇద్దరి పాత్ర ఎనదగినది. జీవితం ఎదగాలంటే నాన్నే మనకు ఆధారం.

    ఫాదర్స్ డే

    నాన్నకు అనురాగం ఉంటుంది. పిల్లలపై ప్రేమను నాన్న మనసులోనే దాచుకుంటాడు. అమ్మ జన్మనిస్తే నాన్న అన్ని తానై నిలుస్తాడు. తన జీవితాన్నే పణంగాపెట్టి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు. మదర్స్ డే ఉన్నట్లు ఫాదర్స్ డే కూడా ఉంది. సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఫాదర్స్ డేను మొదలుపెట్టింది. తండ్రి మనసు తెలుసుకుని ఆయనకు కూడా ఓ రోజు ఉండాలని భావించింది. ఇందులో భాగంగానే ఫాదర్స్ డే ను 1910లో మొదటిసారిగా జరుపుకుంది.

    జూన్ మూడో ఆదివారం

    1966వ సంవత్సరంలో ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే గా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించడంతో అప్పటి నుంచి దీన్ని ఫాదర్స్ డేగా జరుపుకోవడం గమనార్హం. నాన్న తన జీవితాన్ని త్యాగం చేసి పిల్లల పురోభివృద్ధికి అంకితం ఇస్తాడు. కన్న వారి కోసం నిరంతరం శ్రమిస్తాడు. వారిని వృద్ధిలోకి తీసుకురావడానికే పాటుపడతాడు.

    కంటికి రెప్పలా..

    మనం ఎదిగే క్రమంలో నాన్న నిరంతరం కంటికి రెప్పలా కాపాడతాడు. అనుక్షణం మనల్ని అంటిపెట్టుకుని ఉంటాడు. భవిష్యత్ పై భరోసా ఇవ్వడంలో ముందుంటాడు. మనకు వచ్చే కష్టాలను ఎదుర్కోవడమెలాగని సలహాలు ఇస్తుంటాడు. ఇలా నాన్న మన జీవితంలో ఎంతో స్పెషల్ అని గుర్తించుకోవడం సహజమే. నాన్నకు ఫాదర్స్ డే సందర్భంగా ఓ మిలియన్ శక్తుల వందనం.