https://oktelugu.com/

Cucumber Seeds: దోస గింజలతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు

దోస గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ చాలామంది వీటిని తినకుండా బయట పడేస్తుంటారు. ఈ గింజలను రోజూ తింటే యవ్వనంగా కనిపించడంతో చర్మంపై ముడతలు పోయి అందంగా ఉంటారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 14, 2024 / 07:16 AM IST

    Cucumber Seeds

    Follow us on

    Cucumber Seeds: ఆరోగ్యంగా ఉండాలని చాలామంది ఫుడ్ విషయంలో డైట్ ఫాలో అవుతుంటారు. మినరల్స్, పోషకాలు ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. డ్రైఫ్రూట్స్, క్యారెట్, బీట్‌రూట్, పండ్లు, కీరాను వాళ్ల డైలీ డైట్‌లో చేర్చుకుంటారు. వీటిని తినడం వల్ల యంగ్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని భావించి తప్పకుండా వీటిని డైట్‌లో చేర్చుతారు. అయితే ఆరోగ్యంతో పాటు ఫిట్‌గా ఉండాలనుకునే వాళ్లకు దోసకాయ బాగా ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం దోసకాయతోనే మాత్రం కాకుండా దోస గింజలతో కూడా ఎన్నో లాభాలున్నాయి. మరి ఆ లాభాలేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి.

    దోస గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ చాలామంది వీటిని తినకుండా బయట పడేస్తుంటారు. ఈ గింజలను రోజూ తింటే యవ్వనంగా కనిపించడంతో చర్మంపై ముడతలు పోయి అందంగా ఉంటారు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపర్చడంలో సాయపడుతుంది. రోజూ వీటిని తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే పేగులను శుభ్రం చేసి మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండె జబ్బులు తగ్గే అవకాశం ఉంది.

    దోస గింజలలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. అలాగే ఈ గింజలు మధుమేహ రోగులకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే పీచుపదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు జుట్టు పెరిగేలా కూడా చేస్తాయి. ఈ గింజల్లో ఉండే పోషకాలు జుట్టు దృఢంగా ఉండటంతో పాటు రాలిపోకుండా ఉంటుంది. తొందరగా జుట్టు కుదుళ్ల నుంచి పెరుగుతుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి బరువును నియంత్రించడంలో సాయపడతాయి. ఇవి మూత్రాశయ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటంతో పాటు మళ్లీ రాకుండా నియంత్రిస్తుంది.

    యువత ఈమధ్య కాలంలో ఎక్కువగా కీడ్నీ స్టోన్ సమస్యలతో బాధపడుతున్నారు. దోస గింజలు రోజూ తింటే ఈ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ విత్తనాలను పొడిగా లేదా జ్యూస్‌లో కలిపి అయిన తీసుకోవచ్చు. దోసకాయ గింజలు క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తాయి. రోజూ ఈ గింజలు తినడం వల్ల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తాయి. అలానే శరీరంలో అలసట, బలహీనతను తగ్గిస్తాయి. అలాగే మానసిక సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. డైరెక్ట్‌గా ఈ గింజలు తినలేని వాళ్లు సలాడ్‌, జ్యూస్‌లలో అయిన తీసుకోవచ్చు. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల బాడీ డీ హైడ్రేషన్ కాకుండా చేస్తుంది. కాబట్టి రోజు ఏదో ఒక టైంలో వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.