https://oktelugu.com/

Selling Gold: బంగారం అమ్ముతున్నారా.. అయితే ఈ రూల్స్ తెలుసుకోండి

బంగారానికి డిమాండ్ పెరగడంతో చాలామంది గోల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలా దీర్ఘకాల పెట్టుబడులపై లాభాలు వచ్చినట్లయితే తప్పకుండా పన్నులు కట్టాల్సి ఉంటుంది. మీరు కొన్న బంగారాన్ని అమ్మితే లాభాలు వస్తే అందులో ఇరవైశాతం గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 14, 2024 / 06:37 AM IST

    Selling Gold

    Follow us on

    Selling Gold: మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరీ ముఖ్యంగా బంగారం లేనిదే పెళ్లిళ్లు కూడా కావు. ప్రతి ఒక్కరూ వాళ్ల సంపాదించిన దాంట్లో కొంత సేవ్ చేసుకుని తప్పకుండా బంగారం కొంటారు. తప్పని అవసరాలు ఉంటేనే తప్ప వాటిని అమ్మరు. అవసరమైతే లోన్‌ పెట్టుకుంటారు కానీ వీటిని అమ్మడం అస్సలు చేయరు. ఎందుకంటే బంగారాన్ని లక్ష్మీదేవితో కొలుస్తారు. వీటిని అమ్మితే లక్ష్మి దేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందని కొందరు భావించి ఎంత కష్టమైన తాకట్టులో పెడతారు కానీ అమ్మరు. ఈరోజుల్లో బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. రోజురోజుకి దీని రేటు ఆకాశాన్ని తాకుతుంది. దీనిపై పెట్టుబడులు పెట్టిన వాళ్లు లాభాల బాట పడుతున్నారు. అయితే బంగారం కొన్నప్పుడు జీఎస్టీ కడుతున్నాం. అదే విధంగా బంగారం అమ్మినప్పుడు కూడా పన్ను కట్టాలంటా. మరి ఎంత శాతం పన్నుకట్టాలో తెలుసుకుందాం.

    బంగారానికి డిమాండ్ పెరగడంతో చాలామంది గోల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలా దీర్ఘకాల పెట్టుబడులపై లాభాలు వచ్చినట్లయితే తప్పకుండా పన్నులు కట్టాల్సి ఉంటుంది. మీరు కొన్న బంగారాన్ని అమ్మితే లాభాలు వస్తే అందులో ఇరవైశాతం గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. అలాగే బంగారం కొని మూడేళ్ల తర్వాత అమ్మితే.. లాభం ఎంత వచ్చిందో.. అందులో ఇరవై శాతం క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ కట్టాలి.

    బిస్కెట్ బంగారం కాకుండా గోల్డ్ బాండ్స్ మూడేళ్ల లోపల అమ్మితే వాళ్లు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టావసరంలేదు. కానీ వాళ్ల ఆదాయపు పన్నులో భాగంగా.. అదనపు ఆదయం కింద ట్యాక్స్ కట్టాలి. అదే మూడేళ్ల తర్వాత అయితే అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ఇరవై శాతం పన్ను కట్టాలి. దేశంలో వివాహిత మహిళ 500 గ్రాముల బంగారం ఇంట్లో ఉంచుకోవ్చు. అవే అవివాహితలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారం వరకు ఇంట్లో ఉంచుకోవచ్చు. అయితే వీటికంటే ఎక్కువగా కూడా బంగారం ఉంచుకోవచ్చు. కానీ ఐటీ రైడ్స్ జరిగినప్పుడు మీకు పత్రాలు చూపించాలి. లేకపోతే మీరు పన్ను కట్టాల్సివస్తుంది.

    ఈమధ్య చాలామంది గోల్డ్ బాండ్స్‌పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కువగా సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో గరిష్ఠంగా 4 కేజీల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ గోల్డ్ బాండ్స్‌లో మెచ్యూరిటీ ప్లాన్ 8 ఏళ్లు ఉంటుంది. ఇది పూర్తయ్యే వరకు అమ్మకుండా ఉంచితే పెట్టిన పెట్టుబడులపై ఎలాంటి పన్ను విధించరు.