దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. లాక్ డౌన్ నిబంధనలు పూర్తిస్థాయిలో సడలించినా కరోనా కొత్త కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం. అయితే కరోనా ఉధృతి తగ్గినా కొత్తరకం కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా మహమ్మారికి సంబంధించి ఇప్పటికే ఎన్నో లక్షణాలు వెలుగులోకి రాగా శాస్త్రవేత్తలు కొత్త లక్షణాలను గుర్తిస్తున్నారు.
Also Read: కాకరకాయ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలు సాధారణ వ్యాధుల లక్షణాలలా కనిపించినా నిర్లక్ష్యం వహిస్తే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. తాజాగా శాస్త్రవేత్తలు నోరు, నాలుకపై తెల్లని మచ్చలు ఉన్నా కరోనా సోకినట్లేనని చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచా ఆరోగ్య సంస్థ ఈ లక్షణాన్ని జాబితాలో చేర్చలేదు.
Also Read: నోటిపూతతో బాధ పడుతున్నారా.. చెక్ పెట్టే చిట్కాలివే..?
ఎవరికైనా నాలుకపై తెల్లమచ్చలు కనిపిస్తే ఐసోలేషన్ కావడంతో పాటు కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు. కరోనా సోకిన ప్రతి ఐదు మందిలో ఒకరిలో ఈ లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. నోటి అల్సర్లు లాంటి సమస్యలు కూడా కరోనా కావచ్చని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అభిప్రాయపడుతూ ఉండటం గమనార్హం. 45 లక్షల కరోనా బాధితుల డేటాను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
కరోనా సోకిన మరి కొంతమందిలో నోటిలో తెల్లమచ్చలతో పాటు తలనొప్పి, అలసట ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి. నోరు, నాలుకపై అసాధారణ మచ్చలు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.