https://oktelugu.com/

అది ఈ ముదురు భామకే సాధ్యం !

కొంతమంది హీరోయిన్లకు వయసు ఎంత పెరిగినా.. ఏ మాత్రం అందం తరగదు. అలాంటి జాబితాలోకే వస్తోంది ముదురు బ్యూటీ శ్రియ. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల కిందట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇంకా సినిమాలను చేస్తోంది శ్రియ. పైగా ఇంకా ఆమెకు క్రేజ్ కూడా ఉంది. కెరీర్ లో దాదాపు చిరంజీవి నుంచి తరుణ్ వరకు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన శ్రియ, ఎవ్వర్నీ వదల్లేదు. మొత్తానికి అందర్నీ కవర్ చేసేసింది. దానికితోడు కెరీర్ ఆల్ మోస్ట్ క్లోజ్ […]

Written By:
  • admin
  • , Updated On : January 16, 2021 / 02:13 PM IST
    Follow us on


    కొంతమంది హీరోయిన్లకు వయసు ఎంత పెరిగినా.. ఏ మాత్రం అందం తరగదు. అలాంటి జాబితాలోకే వస్తోంది ముదురు బ్యూటీ శ్రియ. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల కిందట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇంకా సినిమాలను చేస్తోంది శ్రియ. పైగా ఇంకా ఆమెకు క్రేజ్ కూడా ఉంది. కెరీర్ లో దాదాపు చిరంజీవి నుంచి తరుణ్ వరకు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన శ్రియ, ఎవ్వర్నీ వదల్లేదు. మొత్తానికి అందర్నీ కవర్ చేసేసింది. దానికితోడు కెరీర్ ఆల్ మోస్ట్ క్లోజ్ అనుకున్న ప్రతిసారి ఓ పెద్ద సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతూ పెళ్లి అయ్యాక కూడా సినిమాలు చేసుకుంటూ ముందుకుపోతుంది.

    Also Read: నమ్రతా పోస్ట్ కు ఫీల్ అయిన రాజు !

    నిజానికి 2014కే శ్రీయా కెరీర్ ఔట్ అనుకున్నారంతా. ఎందుకంటే అప్పటికి ఆమెకు తెలుగులో అవకాశాల్లేవు. సరిగ్గా అదే టైమ్ లో “మనం” అనే క్లాసిక్ హిట్ రావడం, ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడం మొత్తానికి శ్రియ పనైపోయిందనుకున్న ప్రతిసారి ఏదొక భారీ హిట్ వస్తోంది. 2017లో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా వచ్చింది. బాలయ్య సరసన నటించింది. ఆ తర్వాత గాయత్రి, పైసా వసూల్, వీరభోగ వసంతరాయలు లాంటి సినిమాలు చేసింది.

    Also Read: అయ్యొయ్యో.. మరీ ఇంత ఘోరం ఏమిటయ్యా ?

    అయితే గత ఏడాది నుండి ఇక ఆమె కెరీర్ క్లోజ్ అయిందంటూ మళ్లీ గాసిప్స్ మొదలయ్యాయి. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ మూవీ పట్టేసింది. ఇలా మినిమం గ్యాప్స్ లో పెద్ద ప్రాజెక్టులు సంపాదిస్తూ లైమ్ లైట్లో కొనసాగడం అంటే అది ఈ ఒక్క భామకే సాధ్యం అయింది అనుకోవాలి. వచ్చి 20 ఏళ్లయినా శ్రియలో ఆ వేడి, వాడి ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే నాజూకుతనం, అదే సెక్స్ అప్పీల్. అందుకే ఈ ముదురు బ్యూటీని మేకర్స్ కూడా ఇప్పట్లో వదిలిపెట్టేలా లేరు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్