https://oktelugu.com/

కొత్త సచివాలయం.. కేసీఆర్ మళ్లీ మార్చాడు

తెలంగాణ కీర్తి బావుటా నలుదిశలా ఎగిరేలా కొత్త సచివాలయం నిర్మించాలని కేసీఆర్ కలలుగన్నాడు. తెలంగాణ హైకోర్టులో ఎన్ని పిటీషన్లు, అడ్డంకులు ఎదురైనా సరే వాటన్నింటిని అధిగమించి ఎట్టకేలకు పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మాణ పనులు ప్రారంభించాడు. Also Read: ఒక్క ల్యాండ్‌.. ఇద్దరు యజమానులు వచ్చే దసరా పండుగకు కొత్త సచివాలయం నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పనులు ప్రారంభమైన నేపథ్యంలో భవన నిర్మాణం, ఖాళీ స్థలంలో చిన్నపాటి మార్పులు చేస్తూ నిర్మాణ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 20, 2020 / 02:04 PM IST
    Follow us on

    Bullet pfoor secreteriat

    తెలంగాణ కీర్తి బావుటా నలుదిశలా ఎగిరేలా కొత్త సచివాలయం నిర్మించాలని కేసీఆర్ కలలుగన్నాడు. తెలంగాణ హైకోర్టులో ఎన్ని పిటీషన్లు, అడ్డంకులు ఎదురైనా సరే వాటన్నింటిని అధిగమించి ఎట్టకేలకు పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మాణ పనులు ప్రారంభించాడు.

    Also Read: ఒక్క ల్యాండ్‌.. ఇద్దరు యజమానులు

    వచ్చే దసరా పండుగకు కొత్త సచివాలయం నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పనులు ప్రారంభమైన నేపథ్యంలో భవన నిర్మాణం, ఖాళీ స్థలంలో చిన్నపాటి మార్పులు చేస్తూ నిర్మాణ సంస్థకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

    ఇప్పటికే సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణ డిజైన్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పలు మార్పులు సూచించారని తెలిసింది. నిర్మాణ డిజైన్ లో అంతర్గతంగా.. వెలుపల పలు మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా ప్రభుత్వం ఆమోదించిన డిజైన్ లో భవనం ముందు స్థలంలో హెలిప్యాడ్, రెండు వైపులా లాన్లు, వాహనాల పార్కింగ్ స్థలంలో చిన్నపాటి మార్పులు చేశారు.

    Also Read: కేసీఆర్ ను ఓవర్ టేక్ చేస్తున్న జగన్

    రూ.500 కోట్లతో కొత్త సచివాలయంను నిర్మిస్తున్నారు. పాత సచివాలయం కూల్చివేసి శిథిలాలు కూడా ఇప్పటికే తరలించారు. ప్రస్తుతం పనులు సాగుతున్నాయి. హైకోర్టులో కేసులు కూడా తొలిగిపోయిన నేపథ్యంలో పనులు పొందిన సంస్థకు పలు మార్పులు సూచించారు కేసీఆర్.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్