Corona: దేశంలో గత రెండు రోజులుగా మళ్లీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో మరోసారి 2,000కు పైగా కరోనా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఢిల్లీ, కేరళ రాష్ట్రాలలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజలను తీవ్రస్థాయిలో భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమందిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఒక అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 30 శాతం మందిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. డయాబెటిస్, అధిక బాడీ మాస్ ఇండెక్స్ సమస్యలతో బాధపడే వాళ్లను ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తోందని సమాచారం అందుతోంది. అలసట, శ్వాస సంబంధిత సమస్యలు, వాసనను గ్రహించలేకపోవడం లాంటి లక్షణాలు కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కనిపిస్తే లాంగ్ కోవిడ్ గా గుర్తు పెట్టుకోవాలి.
మరోవైపు కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రం అప్రమత్తంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. కరోనా వ్యాక్సిన్ ఇప్పటివరకు వేయించుకోని వాళ్లు వెంటనే వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం వైరస్ విజృంభించకుండా తగిన చర్యలు చేపడుతుండటం గమనార్హం.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రం కరోనా వైరస్ పెద్దగా ప్రభావం చూపడం లేదనే సంగతి తెలిసిందే. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉంటే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం అయితే ఉంటుంది.
Also Read: Prashant Kishor: పీకే చేరికతో కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీని ఓడించడం సాధ్యమేనా?
Recommended Videos: