Corona Virus: ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ లలో కరోనా వైరస్ ఒకటనే సంగతి తెలిసిందే. మన దేశంలో కరోనా కేసులు తగ్గినా ప్రజలు ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థపై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుందనే కామెంట్లు వినిపించాయి.
20 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. కరోనా బాధితులలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు వీర్యకణాల చలనశీలత కూడా తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరోనా సోకిన వాళ్లలో పునరుత్పత్తికి దోహదపడే 21 ప్రోటీన్ల స్థాయిలు తగ్గాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
కొన్ని ప్రోటీన్లు ఉండాల్సిన స్థాయితో పోల్చి చూస్తే సగం కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ విషయాలను నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనలు కరోనా బాధితులను తెగ టెన్షన్ పెడుతున్నాయి.