మనలో చాలామంది మొక్కజొన్న పొత్తులను తినడాన్ని బాగా ఇష్టపడతారు. తక్కువ ధరకే విరివిగా లభించే మొక్కజొన్న పొత్తులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కొందరు మొక్కజొన్న గింజలను కాల్చుకుని తింటే మరి కొందరు ఉడకబెట్టుకుని తింటారు. పీచు పుష్కలంగా ఉండే మొక్కజొన్న జీర్ణక్రియకు బాగా పని చేయడంతో పాటు మలబద్ధకం, మొలలు సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది.
Also Read: నీళ్లు తక్కువగా తాగుతున్నారా.. శరీరానికి కలిగే నష్టాలివే..?
మొక్కజొన్నలో ఉండే ఫోలిక్ యాసిడ్ రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మొక్కజొన్న చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మొక్కజొన్న గింజలతో తయారైన నూనెను చర్మానికి రాస్తే చర్మ మంటలు, ర్యాష్ తగ్గే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న తింటే జుట్టు సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు షైనింగ్ గా ఉంటుంది.
Also Read: గోరు చిక్కుడు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
మొక్కజొన్న హెయిర్ ఫోలీ సెల్స్ కు బలాన్ని చేకూర్చడంలో సహాయపడుతుంది. మొక్కజొన్నలో ఎముకలు బలంగా ఉండటానికి అవసరమైన మినరల్స్, లవణాలు పుష్కలంగా ఉంటాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో మొక్కజొన్న సహాయపడుతుంది. మొక్కజొన్న ద్వారా శరీరానికి అవసరమైన ఐరన్, కాపర్, పాస్పరస్, లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బి 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లావిన్ లాంటి విటమిన్లు లభిస్తాయి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
పేగు క్యాన్సర్ ను అరికట్టడంలో మొక్కజొన్న సహాయపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరచడంలో మొక్కజొన్న తోడ్పడుతుంది. మధుమేహంతో బాధ పడేవాళ్లు మొక్కజొన్నను తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.