Whatsapp: రైలు ప్రయాణం ఈజీ.. వాట్సాప్ ద్వారా ఇలా బుక్ చేసుకోండి..

Whatsapp: నగరంలో ప్రతిరోజూ వందల కొద్దీ ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే వీరు వివిధ యాప్ ల ద్వారా టికెట్ బుక్ చేసుకుంటారు.

Written By: Srinivas, Updated On : June 21, 2024 11:12 am

Book Metro Tickets From Whatsapp

Follow us on

Whatsapp: ప్రస్తుత కాలంలో ప్రతి మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటోంది. మెసేజ్ లతో పాటు ఫొటోలు, వీడియోలు పంపించుకోవడానికి వాట్సాప్ సులభంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాట్సాప్ ద్వారా కావాల్సిన ఫైళ్లను పంపించుకునే సదుపాయం ఉంది. వాట్సాప్ వినియోగదారుల సౌలభ్యం కోసం మాతృసంస్థ మెటా ఎప్పటికప్పుడు ఫీచర్స్ ను అప్డేట్ చేస్తోంది. ఇప్పటికే ఫొటోలు, వీడియోలు, సెక్యూరిటీ విషయంలో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా సిటీలోని మెట్రో రైలులో ప్రయాణించే వారికి ఇది ఉపయోగపడనుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే?

నగరంలో ప్రతిరోజూ వందల కొద్దీ ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే వీరు వివిధ యాప్ ల ద్వారా టికెట్ బుక్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు వాట్సాప్ నుంచి కూడా మెుట్రో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రతిరోజూ మెట్రోలో వెళ్లే వారికి ఇది ఉపయోగపడుంది. ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి మిగతా యాప్ లు బిజీగా ఉండే అవకాశం ఉంది. వాట్సాప్ అయితే చాలా ఈజీగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వాట్సాప్ ద్వారా ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం.. ముందుగా 8341146468 అనే నెంబర్ కు Hi అని మెసేజ్ చేయాలి. టికెట్ కు సంబంధించిన ఒక లింగ్ వస్తుంది. ఇది నేరుగా టికెట్ బుకింగ్ ఆప్షన్ లోకి వెళ్తుంది. ఇక్కడ మీ గమ్యస్తానాలు, తదితర వివరాలు అందించి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఇలా వెంటనే టికెట్ బుకింగ్ అయిపోతుంది. అత్యవసరం ఉన్న వారికి సైతం ఈ బుకింగ్ చాలా ఉపయోగపడనుంది.

గతంలో నాగ్ పూర్ వంటి నగరాల్లో మాత్రమే ఇలాంటి సేవలు ఉండేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఈ సేవలు పనిచేస్తున్నాయి. అయితే ఒక్కోసారి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసిన తరువాత క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది. దీనిని స్కాన్ చేసిన యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. కేవలం ఒక్కరు మాత్రమే కాకుండా వాట్సాప్ గ్రూపులోని 40 మంది ఒకేసారి టికెట్ కొనుగోలు చేయొచ్చు. వీటికి సంబంధించిన మనీని డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది.