influenza: తెలంగాణలో ఈ లక్షణాలు ఉంటే వైద్యుడిని కలవండి

influenza: కరోనా కాలం నుంచి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా భయపడుతున్నారు. అంతలా మనుషుల్లో భయం పుట్టించిన వ్యాధి కరోనా. ప్రపంచమే అతలాకుతలం అయింది. ఇప్పటికి కూడా చైనా దాని తాలూకు ఫలితాలు అనుభవిస్తూనే ఉంది. ఇప్పటికి కూడా దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులు వంటివి వచ్చినా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల తెలంగాణలో ఇన్ ఫ్లుయెంజా తో చాలా మంది బాధపడుతున్నారు. దీంతో ఈ లక్షణాలు ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదని మంత్రి […]

Written By: Srinivas, Updated On : March 9, 2023 3:52 pm
Follow us on

influenza: కరోనా కాలం నుంచి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా భయపడుతున్నారు. అంతలా మనుషుల్లో భయం పుట్టించిన వ్యాధి కరోనా. ప్రపంచమే అతలాకుతలం అయింది. ఇప్పటికి కూడా చైనా దాని తాలూకు ఫలితాలు అనుభవిస్తూనే ఉంది. ఇప్పటికి కూడా దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులు వంటివి వచ్చినా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల తెలంగాణలో ఇన్ ఫ్లుయెంజా తో చాలా మంది బాధపడుతున్నారు. దీంతో ఈ లక్షణాలు ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదని మంత్రి హరీష్ రావు సూచించారు.

ప్రజలు అనవసర భయంతో ప్రవర్తించొద్దని చెబుతున్నారు. ఆస్పత్రుల్లో చేరొద్దని సూచిస్తున్నారు. చిన్న పాటి నొప్పులతో ఆస్పత్రుల్లో చేరొద్దంటున్నారు. మందులు వాడితే సరిపోతుంది. అంతేకాని ఏదో భయపడి ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దు. ఏదైనా ఆపద ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా. సరైన నిర్ణయం తీసుకుంటాం. అందుకే ప్రజలు ఊహల్లో తేలాల్సిన అవసరం లేదు.

ఈ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే చాలా మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అంత భయపడాల్సిన అవసరం లేదు. చిన్న పాటి రోగాలకు కూడా ఆస్పత్రుల్లో చేరొద్దని చెబుతున్నారు. అంత అవసరమైతే ప్రభుత్వమే ప్రజలకు వైద్యం అందిస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు వాతావవరణ మార్పుల వల్ల చోటుచేసుకోవడం సహజమే. దానికి ఏదో ప్రమాదం జరిగినట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి అందరు అప్రమత్తంగా ఉంటే చాలు.

వైద్యుల సూచన మేరకు మందులు వేసుకోవాలి. సులభమైన జబ్బులే కావడంతో కంగారు పడిపోయే ఏదో జరుగుతుందని గాభరా పడాల్సిన పని లేదు. కరోనా నుంచి గుణపాఠం నేర్చుకున్న మనకు ఎంతటి ఉత్పాతం వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది. అందుకే జలుబు, దగ్గు, జ్వరం లాంటి వచ్చినా మందులు వేసుకుని తగ్గించుకోవాలి. వాటితో ఎలాంటి నష్టాలు లేవు. ప్రజలు గుర్తుంచుకుని మసలుకుంటే సరిపోతుంది. అనవసర భయంతో ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.