Coffee Benefits:ఒకప్పుడు ఒక వయసు వచ్చేసరికి నల్ల జుట్టు తెల్లగా మారేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నల్ల జుట్టు తెల్లగా అవుతున్నది. నల్ల జుట్టు తెల్లగా మారితే చాలామంది భయపడుతుంటారు. తెల్లగా మారిన జుట్టును నల్లగా మార్చేందుకు రకరకాల రంగులు వాడుతుంటారు. మార్కెట్లో తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఇందులో రకరకాల రసాయనాలు వాడుతారని.. అవి జుట్టుకు మంచివి కావని పలు రకాల అధ్యయనాలలో తేలింది. వాటిని దీర్ఘకాలం వాడితే రకరకాల వ్యాధులకు కారణమవుతాయని తెలిసింది. ఇలాంటప్పుడు సహజ సిద్ధమైన ప్రక్రియల్లో జుట్టును నల్లగా మార్చుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అందుకు ఈ పద్ధతి మేలని సూచిస్తున్నారు.
వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు
వైద్యులు సూచించిన పద్ధతిని అమలు చేసేందుకు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ వైపు వెళ్లాల్సిన అగత్యం అంతకన్నా లేదు. జస్ట్ మీ వంటింటి వైపు కాస్త దృష్టి సారిస్తే చాలు. వంటింట్లో కాఫీ పొడి ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఇది మన శిరోభారాన్ని తగ్గించడమే కాదు.. శిరోజాలను నల్లగా మార్చుతుంది. అవుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి కాఫీ పొడి నుంచి రంగోలి తయారు చేయవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రెండు పెద్ద స్పూన్ ల కాఫీ పొడిలో.. ఒక స్పూన్ హెయిర్ కండిషనర్ తీసుకోవాలి. అలా రెండిటినీ కలపాలి. ఆ తర్వాత ఆప్ పేస్టును జుట్టుకు బాగా పట్టించాలి. గంటసేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత జుట్టును నీటితో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో షాంపూ వాడకూడదు. ఇదే కాకుండా మరో విధానంలో కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాఫీ పొడి తీసుకుని.. అందులో అలోవీరా జెల్ కలపాలి. ఆ పేస్టును జుట్టుకు పట్టించాలి. గంటసేపటి తర్వాత జుట్టును సాధారణ నీటితో కడగాలి. ఇప్పుడు కూడా ఎటువంటి షాంపూ వాడకూడదు. కాఫీలో ఉన్న ఆల్కలాయిడ్లు జుట్టును తెల్లగా చేయడానికి ఉపకరిస్తాయి. పైగా ఇది హెన్నా కంటే మెరుగ్గా పనిచేస్తుంది.
అనేక రకాలుగా ఉపకరిస్తాయి
కాఫీ పౌడర్ లో ఉన్న లక్షణాలు జుట్టుకు అనేక రకాలుగా ఉపకరిస్తాయి. జుట్టు నల్లగా మారడమే కాకుండా సిల్కీగా కనిపిస్తుంది. అంతేకాదు తలలో కొల్లాజన్ స్థాయిని పెంచుతుంది. నిక నిగలాడే జుట్టుకు కాఫీ పౌడర్ చాలా మంచిదని పలు రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా జుట్టులో తేమను కాఫీ పౌడర్ క్రమబద్ధీకరిస్తుంది. (ఈ కంటెంట్ పలువురు వైద్యులు, మాకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మీకు అందించాం. వీటిని వాడే ముందు ఒకసారి వైద్యుల సలహా తీసుకుంటే మంచిది.)