Cigarette : దీంతో.. రోజువారీ తగాదాలు సంబంధాన్ని నాశనం చేస్తుంటాయి. అందుకే మీ భాగస్వామి మనసు నొచ్చకోకుండా ఉండాలంటే ఈ చెడు వ్యసనానికి గుడ్ బై చెప్పాలి. సరైన సమయంలో సిగరెట్ తాగే అలవాటును వదిలించుకోవడం చాలా ముఖ్యం. మీ భాగస్వామికి నచ్చని ఈ పని మానుకోవడం వల్ల మీ బంధం చాలా స్ట్రాంగ్ అవుతుంది.
ముందుగా మీ భాగస్వామితో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి. సిగరెట్ తాగడం వల్ల కలిగే నష్టాల్ని వివరించండి. ఈ చెడు అలవాటు వల్ల ఆరోగ్యానికే కాకుండా.. మీ బంధం మధ్య సృష్టిస్తున్న కల్లోల్లాన్ని వివరించండి. ఈ చెడు అలవాటుకు గుడ్ బై చెప్పమని అడగండి. ఇలా చేసేటప్పుడు మీరు మీ పిల్లలు లేదంటే కుటంబసభ్యుల నుంచి సహాయం కూడా తీసుకోవచ్చు. నిజానికి పిల్లలతో మీ భాగస్వామి బాగా కనెక్ట్ అవుతాడు. దీంతో.. పిల్లలు చెబితే.. ఈ చెడు వ్యసనాన్ని వదులుకునేందుకు రెడీ అవుతాడు.
ఎవరికైనా ఏదైనా వ్యసనాన్ని వదులుకోవడం అంత సులభం కాదు. కాబట్టి మీ భాగస్వామికి ధూమపానం చేయాలని అనిపించినప్పుడల్లా, ఏదైనా స్పైసీ వంటకాన్ని సిద్ధం చేసి, అతనికి/ఆమెకు వండించండి. ఇలా ప్రతి సారి చేయండి. ఇలాంటి చేయడం వల్ల ఆ కోరిక వచ్చినప్పుడుల్లా మనసు డైవర్ట్ అవుతుంది. సో మీరు ధూమపానం నుంచి డైవర్ట్ అవుతారు.
మీ భాగస్వామి సిగరెట్ వ్యసనాన్ని సులభంగా వదులుకోవాలనుకుంటే, మీరు దానిని ప్రేమగా వివరించాలి. తగాదాలు ఎల్లప్పుడూ మీ బంధాన్ని మరింత దిగజార్చుతాయి అని గుర్తు పెట్టుకోండి. మీ భాగస్వామి సిగరెట్ తాగే అలవాటు మీ బందంపై ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపిస్తుందో ప్రేమగా చెప్పాలి. అలా వదిలేయకపోతే భవిష్యత్తులో చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుందని వివరించాలి. దీని వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో భాగస్వామికి తెలుస్తుంది. రాను రాను ఆ అలవాటుకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంటుంది.
సిగరెట్ తాగే అలవాటును వదులుకోవడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో మీరు ఓపిక పట్టాలి. ఈ చెడు అలవాటును క్రమంగా వదిలించుకునేలా ప్రయత్నించండి. అంతే కాకుండా.. మీ భాగస్వామిని సిగరెట్ తాగమని బలవంతం చేసే వారితో దూరంగా ఉంచడం బెటర్. చెడు సహవాసానికి దూరంగా ఉంచాలి. మీ భాగస్వామి మారాలనుకున్నా.. ఇలాంటి వారు మారనివ్వరు. అందుకు మీ భాగస్వామిని ఇలాంటి వారి నుంచి దూరంగా ఉంచేలా ప్రయత్నించండి.
ప్రయత్నించి అలిసి పోతే కౌన్సెలర్ లేదా డాక్టర్ సలహా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామిలో మార్పు చూడవచ్చు. అందుకే నిపుణుడి సలహాలు ఇప్పిస్తేనే ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలన్నీ పాటిస్తే మీ భాగస్వామి సిగరెట్ తాగే వ్యసనాన్ని దూరం చేసుకోవచ్చు.