ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగరవేయడానికి ఆసక్తి చూపుతారనే సంగతి తెలిసిందే. అయితే పిల్లలైనా, పెద్దలైనా గాలిపటాలను ఎగరవేసే సమయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవడంతో పాటు అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉంటుంది. చాలామంది గాలిపటాలు ఎగరవేయాలనే కంగారులో కనీస జాగ్రత్తలను పాటించరు.
Also Read: నిద్రలేమికి సులభంగా చెక్ పెట్టే చిట్కాలివే…?
భవనాలపై నుంచి గాలిపటాలను ఎగరవేసేవాళ్లు ఎక్కడ నిలబడ్డామో, మనం నిలబడిన ప్రదేశానికి దగ్గరలో కరెంట్ వైర్లు, ఇతర వైర్లు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. బాల్కనీలు, గోడలపై నిల్చొని ఎట్టి పరిస్థితుల్లోను గాలి పటాలు ఎగరవేయకూడదు. గాలిపటాలను ఎగరవేయడానికి సాధారణ దారాలను మాత్రమే ఉపయోగించాలి. చైనా మాంజా దారాలను ఉపయోగిస్తే కొన్నిసార్లు ఆ దారాలు పాదాచారులకు చుట్టుకుని పాదాచారుల ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి.
Also Read: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో కిలో చికెన్ ఎంతంటే..?
లెనిన్, కాటన్ దారాలను ఉపయోగించి గాలిపటాలను ఎగరవేస్తే మంచిది. మెటాలిక్ దారాలను ఎట్టి పరిస్థితుల్లోను ఉపయోగించకూడదు. మెటాలిక్ దారాల వల్ల కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దారాలను ఉపయోగించకపోవడమే మంచిది. రోడ్డుపై నుంచి గాలిపటాలు ఎగరేసే వాళ్లు వాహనాలు తిరిగే ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరవేయకూడదు. ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సైతం గాలిపటాలు ఎగరవేయకుండా ఉంటే మంచిది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
గాలిపటాలు ఎగరవేయడం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల గతంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. తల్లిదండ్రులు గాలిపటాలను ఎగరవేసే పిల్లలు కూడా జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడటంతో పాటు వారికి తగిన సూచనలు చేయాలి.