Childrens: తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారిని ఒక్క క్షణం కూడా ఎక్కడా వదలకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకున్న సరే.. వాళ్లు కొన్ని చెడు అలవాట్లకు దగ్గర అవుతుంటారు. ఎందుకంటే చిన్న వయస్సులో వారికి మంచి ఏది, చెడు ఏది తెలియదు. ప్రతి విషయాన్ని తల్లిదండ్రులే దగ్గర ఉండి చెప్పాలి. చిన్నప్పుడు వాళ్ల చుట్టూ ఏం జరుగుతుందో.. వాటి ఆధారంగానే వారు పెద్దయ్యాక ఉంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు కేవలం చదువు వస్తే చాలు.. ఇంకా ఏం అవసరం లేదని అనుకుంటారు. ఈ విధంగానే ఆలోచించి పిల్లలను బాగా చదివిస్తారు. కానీ వారికి క్రమశిక్షణ మాత్రం నేర్పించరు. పిల్లలు ఎంత చదువుకున్న కూడా వారికి తప్పకుండా క్రమశిక్షణ అనేది ఉండాలి. అప్పుడే వారు జీవితంలో ఉన్నత స్థితిలో ఉంటారు. లేకపోతే వారు భవిష్యత్తులో ఎంత స్థాయికి ఎదిగిన విలువ ఉండదు. ఇతరులను గౌరవంచలేరు. అయితే పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తప్పకుండా 5 సూత్రాలను నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఐదు సూత్రాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పిల్లలు భవిష్యత్తులో సక్సెస్ కావాలంటే తప్పకుండా ఈ ఐదు సూత్రాలు చెప్పాలి. అందులో మొదటిది కృతజ్ఞతా భావంతో పెంచాలి. అంటే ఎవరైనా సాయం చేస్తే వారి మీద కృతజ్ఞతా భావం ఉండాలి. ఎవరైనా సాయం చేస్తే కృతజ్ఞలు చెప్పాలని తెలపండి. భవిష్యత్తులో వారికి సాయం చేయాలని తెలియజేయండి. ఇలా చేయడం వల్ల వారు ఇతరులతో మంచిగా ఉంటారు. రెండోది మనుషులు, మొక్కలు, జంతువులపై జాలి, దయ ఉండేలా చూసుకోండి. అంటే చిన్నతనం నుంచి వారికి వీటిపై దయ ఉండాలి. మొక్కలు నాటుతుండాలి. జంతువులను పెంచుకోవడం, మనుషులను గౌరవించి విలువ ఇవ్వడం వంటివి అలవరచుకోవడం నేర్పించుకోవాలి. అలాగే పిల్లలకు ఏకాగ్రత ఉండాలి. అంటే వారు రోజూ మెడిటేషన్, ధ్యానం చేసేలా వారికి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలు పరధ్యానంగా ఉండకుండా చాలా స్మార్ట్‌గా ఉంటారు.
కొందరు పిల్లలు తప్పు చేస్తారు. కానీ ఒప్పుకోరు. తప్పు చేస్తే ఒప్పుకోవాలని పిల్లలకు నేర్పించండి. తప్పు చేస్తే ఇతరులకు క్షమాపణ చెప్పేలా చేయండి. ఇలా చేయడం వల్ల వారికి వారి తప్పు ఏంటో తెలుస్తుంది. అలాగే కొందరు ఇతరులపై పగను పెంచుకుంటారు. ఇలా పెంచుకోవడం వల్ల వారి మనసులో స్వార్థం మొదలవుతుంది. దీంతో వారు చెడు అలవాట్లకు దగ్గర అవుతారు. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచి ఈ విషయాలు తప్పకుండా నేర్పించండి. ఇలా చెప్పడం వల్ల వారు భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉంటారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పిల్లలకు ఈ విషయాలు చెప్పడం వల్ల వారు అలవాటు పడతారు. పెద్ద అయిన తర్వాత చెప్పిన ఫలితం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.