chikungunya : ప్రపంచంలో ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయి. అన్నింటి కంటే ప్రజలు ఎక్కువగా కరోనాకి భయపడ్డారు. అయితే ఈ మధ్య చికున్‌గన్యా ప్రజలను వేధిస్తోంది. ఇది వస్తే మనిషి దీర్ఘకాలికంగా కీళ్ల నొప్పులు, కదలేనంత నీరసంగా అయిపోతారు. చిన్న పెద్ద తేడా అని లేకుండా అందరికీ చికున్‌గన్యా సోకుతుంది. ఆల్ఫావైరస్‌ల జాతికి చెందిన చికున్‌గన్యా ఈడిస్ ఈజిప్టు, ఈడిస్ ఆల్బోపిక్టస్ దోమల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ఉన్నవారిని కుట్టిన దోమ మళ్లీ వేరేవారిని కుట్టినప్పుడు ఈ వైరస్ వ్యాపిస్తుంది. చికున్‌గన్యా వచ్చిన వారు తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడతారు. అయితే ఈ వ్యాధి మొదటిసారి 1952లో టాంజానియాలో వచ్చింది. ఈ వ్యాధి అంత ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ ఆరోగ్యం బలహీనపడుతుంది.
చికున్‌గన్యా సోకిన వారికి అకస్మాత్తుగా 102 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్‌తో జ్వరం వస్తుంది. ఆ తర్వాత కండరాలు, కీళ్ల నొప్పులు అధికం అవుతాయి. తీవ్ర జ్వరం, కాళ్లు, చేతులు, మడమలు, భుజాలు అన్నింట్లో బాగా నొప్పులు రావడంతో పూర్తిగా నడవలేరు. కొందరికి చర్మం మీద మచ్చలు, దురద వంటివి కూడా వస్తాయి. ఈ లక్షణాలు అన్ని కనిపించడానికి కొందరికి రెండు రోజుల సమయం పడితే.. మరికొందరికి 12 రోజుల సమయం పడుతుంది. మిగతా వ్యాధులతో పోలిస్తే చికున్‌గన్యా అంత ప్రమాదం కాదు. కానీ కాళ్లు నొప్పులతో బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు కొన్ని నెలల వరకు దీనితో బాధపడతారు. కాళ్లు తీవ్రంగా నొప్పు వస్తున్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించి వేంటనే పరీక్షలు చేసుకోవడం మేలు.
ఈ వ్యాధి ఉందని నిర్ధారణ తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ రకం మందులు వేయాలి. అలాగే ఒంట్లో నీటి శాతం తగ్గకుండా జ్యూస్‌లు ఎక్కువగా తాగుతుండాలి. ఎక్కువగా కష్టపడకుండా విశ్రాంతి తీసుకోవాలి. నొప్పులు అనేవి తప్పకుండా ఉంటాయి. వీటికి మందులు వేసిన తగ్గడం కష్టమే. చికున్‌గన్యా వచ్చినప్పుడు కొన్ని రోజుల వరకు నొప్పులు అనేవి సహజం. కాబట్టి రోగనిరోధక శక్తి తగ్గకుండా పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం చేయాలి. ఒక్కపూట మానకుండా సరైన సమయానికి మూడు పూటలు భోజనం చేయాలి. బొప్పాయి, కివీ పండ్లు చికున్‌గన్యాను తగ్గిస్తాయి. అయితే ఈ చికున్‌గన్యా ఒకసారి వస్తే ఇంకోసారి రాదు. అయితే దీనికి మనదేశంలో టీకా లేదు. కానీ అమెరికాలో ఈ టీకా అందుబాటులో ఉంది. ఈ వ్యాధి రాకుండా పొడవైన దుస్తులు ధరించాలి. దోమలు నిల్వ ఉండకుండా పాత్రలకు మూతపెట్టాలి. ఇంటి లోపలికి దోమలు రాకుండా దోమతెరలు వంటివి వాడాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకు చికున్‌గన్యా వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.