Health news : రోజంతా ఎనర్జీటిక్‌గా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

సాధారణంగా చాలా మంది లేచిన వెంటనే టీ, కాఫీ వంటివి తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా బెడ్ కాఫీ, టీ కావాలని అనుకుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచివి కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Written By: NARESH, Updated On : September 29, 2024 8:42 pm

All day energetic

Follow us on

Health news : రోజులో ఎక్కువగా వర్క్ చేయాలంటే ఎనర్జీ తప్పనిసరిగా ఉండాలి. శరీరానికి ఎనర్జీ రావాలనేది కేవలం మనం తినే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేచిన వెంటనే కొన్ని నియమాలు పాటిస్తూ సరైన ఆహారం తీసుకుంటే రోజంతా ఎనర్జీటిక్‌గా ఉంటారు. లేకపోతే ఏదో కోల్పోయినట్లు నీరసం అయిపోతారు. కొందరు వర్క్ బిజీలో పడి పొద్దున్న తినడం మానేస్తారు. రోజులో ఏ పూట భోజనం చేయకపోయిన పర్లేదు. కానీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మాత్రం చేయకపోతే ఎక్కడలేని నీరసం అంతా మీదగ్గరే ఉంటుంది. దీనివల్ల ఆ రోజుకి నీరసంగా ఉండటం మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట పోషకాలు, ఫైబర్ ఉండే కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారి నుంచి తప్పించుకోవడంతో పాటు రోజంతా ఎనర్జీటిక్‌గా ఉంటారు. అయితే ఉదయం పూట తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం.

ప్రస్తుతం చాలామంది ఉదయం లేచిన వెంటనే మొబైల్ ధ్యాసలో ఉంటున్నారు. అయితే ఇది మంచిది కాని నిపుణులు చెబుతున్నారు. లేచిన వెంటనే గోరు వెచ్చని నీరు తాగి యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి రోజంతా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంచడంలో సాయం చేస్తుంది. అలాగే ఫైబర్ రిచ్ పదార్థాలను ఉదయం పూట టిఫిన్‌లో చేర్చుకోవాలి. వీటివల్ల రోజంతా మీరు ఎనర్జీటిక్‌గా ఉంటారు. ముఖ్యంగా ఇడ్లీ, మొలకెత్తిన గింజలు, క్యారెట్ వంటి పచ్చికూరగాయలు, పెసరదోశ, మిల్క్, జ్యూస్‌లు, గుడ్లు వంటివి తీసుకుంటే తక్షణమే శక్తి లభిస్తుంది. వీటివల్ల రోజంతా ఎనర్జీటిక్‌గా ఉండటంతో పాటు ఫిట్‌గా కూడా ఉంటారు. అలాగే ప్రొటీన్ ఉండే పదార్థాలను కూడా ఉదయం పూట తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

సాధారణంగా చాలా మంది లేచిన వెంటనే టీ, కాఫీ వంటివి తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా బెడ్ కాఫీ, టీ కావాలని అనుకుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచివి కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే నిమ్మకాయ రసం, వేడి నీరు వంటివి తాగిన తర్వాత వీటిని తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తాగడం వల్ల ఎలాంటి నీరసం లేకుండా రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. టిఫిన్స్ చేయాలని లేకపోయిన వాళ్లు పోషకాలు ఉండే బ్రెడ్, తాజా పండ్లు వంటివి తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే ఉదయం లేచిన తర్వాత కొంత సమయం పాటలు వింటే రోజంతా చిరాకుగా కాకుండా యాక్టివ్ అనిపిస్తుంది. అలాగే పొద్దున్న కోపానికి, బాధకి గురైతే రోజంతా మీరు మూడీగా ఉంటారు. కాబట్టి ఉదయం పూట సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.