exercise : వ్యాయామం అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో అందరూ వాళ్ల వర్క్‌లో ఉంటున్నారు. కనీసం వ్యాయామం చేయడానికి కూడా సమయం సరిపోదు. ఎప్పుడు వర్క్ చేసుకోవడం, కాస్త సెలవు దొరికితే ఇంట్లోనే సేదతీరడం వంటివి చేస్తారు. సేద తీరడం మంచిదే. కానీ వ్యాయామం చేయకపోవడం ఆరోగ్యానికి అంత మంచిది. కాదు. కనీసం వీకెండ్ సమయాల్లో అయిన వ్యాయామం చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. రోజూ వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే.. వీకెండ్స్‌లో వ్యాయామం చేస్త.. 200కి పైగా వ్యాధులు రాకుండా ఆపేంత పవర్ వస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. అంత సమయం లేనివాళ్లు వారాంతంలో చేయాలి. వీరినే వీకెండ్ వారియర్స్ అని కూడా పిలుస్తారు. రోజుకి కనీసం పది నుంచి 20 నిమిషాలు అయిన వ్యాయామం చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
వీకెండ్‌లో వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు, ఊబకాయ, గుండె సంబంధిత ప్రమాదాలు రాకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వ్యాయమం చేస్తే బరువు తగ్గుతారని చాలా మంది భావిస్తారు. కానీ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటంతో వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, దీర్ఘకాలికంగా వచ్చే ప్రమాదాలను కూడా వ్యాయామం తగ్గిస్తుంది. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా కాస్త ప్రశాంతంగా ఉంటారు. కండరాలు బలంగా కావడంతో పాటు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వ్యాయామంతో చెక్ పెట్టవచ్చు. ప్రారంభంలో కాస్త తక్కువగా చేస్తూ.. రోజురోజుకి పెంచాలి. అప్పుడే వ్యాయామం చేసిన మీకు అంత కష్టంగా అనిపించదు. మొదట్లో నడవడం మొదలు పెట్టండి. ఆ తర్వాత నెమ్మదిగా పరిగెత్తడం వంటివి చేయండి.
రోజూ వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా దృఢంగా ఉంటారు. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. శారీరకంగా ఫిట్‌గా ఉండటంతో పాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు. కొందరు చిన్న సమస్యకి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందుతారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల ప్రతి విషయాన్ని సామరస్యంగా ఆలోచిస్తారు. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తెలివిగా సమస్యను పరిష్కరించుకుంటారు. నెగిటివ్ ఆలోచనలు రాకుండా పాజిటివ్ ఆలోచనలు వచ్చేలా వ్యాయామం చేస్తుంది. మెదడు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఏరోబిక్ వంటి వ్యాయామాలు చేసిన ఆరోగ్యంగా ఉంటారు. వ్యాయామం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు. హాయిగా నిద్రపడుతుంది. కాబట్టి రోజూ వ్యాయామం చేయడం కుదరకపోతే వారానికి ఒకసారి అయిన వ్యాయామం చేయడం ఉత్తమం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More