Travel: ఎక్కువగా ప్రయాణాలు చేస్తే వృద్ధాప్య ఛాయలు మాయం.. ఇందులో నిజమెంత?

ఎక్కడికి వెళ్లకుండా ఒకే ప్రదేశంలో ఉండటం వల్ల బద్దకం ఏర్పడుతుంది. అలాగే మైండ్ కూడా బాగా ఇబ్బంది పడుతుంది. అదే బయటకు ఎక్కడికైనా వెళ్లడం వల్ల కొత్త పరిచయాలు పెరుగుతాయి. దీనివల్ల మైండ్‌లో చర్యలు మారుతాయి.

Written By: Kusuma Aggunna, Updated On : October 24, 2024 3:22 pm

Travel

Follow us on

Travel: ప్రయాణాలు చేయడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. కాకపోతే డబ్బులు, సమయం లేక కొందరు ప్రయాణాలు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిన్నింటిని చూడాలని కొందరు ఇష్టపడుతుంటారు. కొందరు ఏదో టైమ్ పాస్‌కి చూడటానికి వెళ్తే.. మరికొందరు మాత్రం పని కట్టుకుని మరి తిరగడానికి వెళ్తుంటారు. కుటుంబం, స్నేహితులు లేదా ఒంటరిగా కూడా కొందరు ప్రయాణాలు చేస్తారు. ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం వల్ల మనసులోని బాధను మర్చిపోయి.. సంతోషంగా ఉంటారని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా బ్రేకప్ అయ్యే వారు ఎక్కువగా కొత్త ప్రదేశాలు సందర్శించడం వల్ల గతంలో ఉన్న వ్యక్తిని మరిచిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చాలా అధ్యయనాల్లో కూడా తేలింది. బయటకు వెళ్లిన తర్వాత కొత్తగా పరిచయాలు పెరగడం, వారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం వల్ల జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఎలాంటి ఒత్తిడి, ఆందోళన ఉన్నా కూడా ట్రావెల్ బాగా ఉపయోగపడుతుంది. కొందరు వ్యక్తిగత కారణాల వల్ల డిప్రెషన్‌లో ఉంటారు. ఎన్ని మందులు వాడిన కూడా డిప్రెషన్ నుంచి బయటకు రాని వారు ట్రావెల్ చేయడం వల్ల ఒక్కసారిగా డిప్రెషన్ నుంచి విముక్తి చెందుతారు. అయితే ట్రావెల్ చేయడం వల్ల ఇవే ప్రయోజనాలు కాకుండా మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉందట. మరి ఆ ప్రయోజనం ఏంటో తెలియాలంటే స్టోరీపై ఒక లుక్కేయండి.

ఎక్కడికి వెళ్లకుండా ఒకే ప్రదేశంలో ఉండటం వల్ల బద్దకం ఏర్పడుతుంది. అలాగే మైండ్ కూడా బాగా ఇబ్బంది పడుతుంది. అదే బయటకు ఎక్కడికైనా వెళ్లడం వల్ల కొత్త పరిచయాలు పెరుగుతాయి. దీనివల్ల మైండ్‌లో చర్యలు మారుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గి.. చర్మం ఆరోగ్యంగా ఉంటుందట. ఎలాంటి టెన్షన్ లేకపోవడం వల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు రావట. దీనివల్ల ఎక్కువ రోజులు యంగ్‌గా కనిపిస్తారు. ఏవైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు బాడీలో హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. ఇలా సంతోషంగా ఉండటం వల్ల చర్మం గ్లో పెరుగుతుంది. బయటకు వెళ్లినప్పుడు అన్ని ప్రదేశాలు తిరగడం వల్ల కాస్త శారీరక శ్రమ అవుతుంది. దీనివల్ల కాస్త రిలీఫ్ అవుతారు. అలాగే బయటకు వెళ్లినప్పుడు బాధలను కొంత వరకు మరిచిపోతారు. అక్కడ ఆడుకోవడానికి సైక్లింగ్ వంటి ఆటలు కూడా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటివల్ల బాడీకి వ్యాయామం అందుతుంది. ఆరోగ్యంగా ఉండటంతో పాటు యంగ్‌గా ఉండాలంటే వ్యాయామం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. కాబట్టి దీనివల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి వీలు కుదిరిన ప్రతీసారి ట్రావెల్ చేయడం వల్ల కేవలం చర్మ ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.