https://oktelugu.com/

కేసీఆర్ నిర్ణయం వెనుక కుట్ర: బండి సంజయ్ సంచలన ఆరోపణ

తెలంగాణలో నియంత్రిత సాగు విధానాన్ని సీఎం కేసీఆర్ నిన్న ఎత్తివేశారు. అంతేకాదు ప్రతి గ్రామంలోనూ ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సైతం తొలగిస్తున్నట్టు ప్రకటించారు. రైతులు తమకు నచ్చిన చోట నచ్చిన ధరకు పంటలు అమ్ముకోవచ్చని.. ఇది కేంద్రంలోని బీజేపీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టం అంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చి నెపాన్ని బీజేపీపై నెట్టారు. Also Read: అపచారం.. తిరుమలలో సీఎం రమేశ్ ఏంటి పని? అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై […]

Written By: , Updated On : December 28, 2020 / 08:31 PM IST
Follow us on

Bandi Sanjay

తెలంగాణలో నియంత్రిత సాగు విధానాన్ని సీఎం కేసీఆర్ నిన్న ఎత్తివేశారు. అంతేకాదు ప్రతి గ్రామంలోనూ ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సైతం తొలగిస్తున్నట్టు ప్రకటించారు. రైతులు తమకు నచ్చిన చోట నచ్చిన ధరకు పంటలు అమ్ముకోవచ్చని.. ఇది కేంద్రంలోని బీజేపీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టం అంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చి నెపాన్ని బీజేపీపై నెట్టారు.

Also Read: అపచారం.. తిరుమలలో సీఎం రమేశ్ ఏంటి పని?

అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తొలగిస్తామని కేసీఆర్ సర్కార్ చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నాడని విమర్శించారు.

రాబోయే రోజుల్లో కొంత అయోమయం సృష్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండిసంజయ్ ఆరోపించారు.

Also Read: బీజేపీ సీఎం అభ్యర్థి సౌరభ్ గంగూలీయేనా?

రైతు వేదికలను కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని బండి సంజయ్ సూచించారు. పంట కొనుగోళ్లతో రూ.7500 కోట్లనష్టం వచ్చిందని చెబుతున్న సీఎం.. అందుకు గల కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలకు సీఎం కేసీఆర్ మద్దతిస్తున్నట్టే దీని అర్థం అని సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్