Chanakya Nithi: మనలో ప్రతి ఒక్కరూ జీవితాంతం సంతోషంగా జీవనం సాగించాలని భావిస్తూ ఉంటారు. అయితే మనం కోరుకునే వాటి విషయంలో మనకు అర్హతలు ఉన్నాయా? లేవా? అనే విషయాలను మాత్రం అస్సలు పట్టించుకోరు. మన జీవితంలో కొన్ని అదృష్టం వల్ల దక్కినా అలాంటి వాటి వల్ల దీర్ఘకాలంలో ఎక్కువగా ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు. ఆచార్య చాణక్యుడు ప్రధానంగా మూడు లక్షణాలను మనం కలిగి ఉంటే శత్రువైనా సలాం కొడతాడని చెప్పారు.
మనకు ఎక్కడైనా గౌరవం లభించాలంటే తెలివి, జ్ఞానం ఉండాలి. వీలైనంత జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల మనిషిగా మనం మరింత ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మనం జ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు ఇతరులతో ఆ జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. జ్ఞానం పెంచుకోవడం వల్ల శత్రువుల దగ్గర కూడా మనకు గౌరవం లభించే అవకాశాలు ఉంటాయి.
నిజాయితీతో సంస్కారవంతంగా మనం జీవనం సాగించాలి. సంస్కారం, నిజాయితీతో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు చేయడానికి అవతలి వ్యక్తులు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అందువల్ల శత్రువులు కూడా మన ప్రతిష్టను దెబ్బ తీయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని గుర్తు పెట్టుకోవాలి. చేసే పనిలో మనం నిష్ణాతులు కావడానికి అవసరమైన స్థాయిలో కృషి చేస్తే మంచిదని చెప్పవచ్చు.
చేసే పనిలో నైపుణ్యాలను ప్రదర్శించడం వల్ల డబ్బుతో పాటు సమాజంలో గౌరవం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి వాళ్లకు సంబంధిత రంగంలో గౌరవం లభించడంతో పాటు డబ్బు కూడా లభిస్తుంది. ఇలా చేయడం ద్వారా శత్రువులు కూడా మన నైపుణ్యాలను మెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది.
Also Read: KCR: బిగ్ బ్రేకింగ్: ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన కేసీఆర్