Pawan Kalyan Somu Veeraju: పవన్ కళ్యాణ్ చిరకాల వాంఛ తీరే సమయం వచ్చింది. తోడుగా బీజేపీ కలిసి వస్తోంది. ఇక సీఎం కుర్చీపై పవన్ కూర్చోవడమే ఆలస్యం అన్నట్టుగా ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. అధికార వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత.. అందిపుచ్చుకోలేని టీడీపీ ఆసహాయత.. మధ్యలో బలం పుంజుకుంటున్న జనసేన-బీజేపీ ల నడుమ ఏపీ రాజకీయాల్లో పొత్తు పొడుపులే కీలకంగా మారాయి. బీజేపీ-జనసేన కలిసి సాగబోతున్నాయి. టీడీపీ కలిసి వస్తే మరింత బలం పుంజుకోవడం ఖాయం. మరి చంద్రబాబు ఏం చేస్తారన్న దానిపై స్పెషల్ ఫోకస్..

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల ముందే ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి.. రసకందాయంలో పడ్డాయి. జనసేన 9వ ఆవిర్భావ సభా వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చేసింది. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. అవసరమైతే ఎవరితోనైనా కలుస్తానని పవన్ చేసిన ప్రకటన టీడీపీకి ఊపిరిపోసింది.
Also Read: Ramarao on Duty: ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ‘రామారావు’
దీన్ని బట్టి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన+బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏపీలో పోటీచేసి వైసీపీని ఓడించి రాజ్యాధికారం దక్కించుకోగలుగుతారు. చంద్రబాబు నిర్ణయంపైనే ఈ పొత్తు ఆధారపడి ఉంది. ఏపీలో బీజేపీ, జనసేనతో పోలిస్తే టీడీపీ పెద్ద పార్టీ. టీడీపీ పొత్తుపై డిఫెన్స్ లో పడింది. వైసీపీని ఓడించాలంటే టీడీపీకి కలిసి వస్తేనే సాధ్యం. టీడీపీ వస్తే ఈ కూటమికి విజయావకాశాలుంటాయి. మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఉత్కంఠగా మారింది. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే మనుగడ.. కానీ అధికారం మాత్రం పొత్తులతోనే సాధ్యం. ఇలాంటి సంకట స్థితిలోకి టీడీపీ ఉంది.
టీడీపీతో బీజేపీ+జనసేన పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో చంద్రబాబు నిర్ణయంపై ఈ పొత్తు పొడుస్తుందా? లేదా? అన్నది ఆధారపడి ఉంది.. కానీ టీడీపీకి మాత్రం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. మూడు పార్టీలు పోటీచేస్తే ఖచ్చితంగా గెలుపు ఖాయం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఆ పార్టీ ఓడిపోతుంది. ఇప్పుడు టీడీపీ ఈ కూటమిలో చేరుతుందా? లేదా? అన్నది సందేహంగా మారింది. జగన్ కు అధికారం అప్పగించడమా? కూటమికి సపోర్టు చేయడమా? అన్నది ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఉంది. మరి ఆయన ఏం చేస్తారన్నది భవిష్యత్తులో తేలనుంది.
Also Read: Somu Veerraju: పవన్ కళ్యాణ్ యే సీఎం.. టీడీపీని డిఫెన్స్ లో పడేసిన సోము వీర్రాజు
Recommended Video:

[…] April Fools Day: వచ్చేది ఏప్రిల్ మాసం. ఉదయం లేవగానే ఏప్రిల్ ఫూల్ అంటూ సన్నిహితులను, మిత్రులను ఫూల్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయినా, ఈ ‘ఫూల్స్ డే’ అనగానే పెద్ద మనిషిలో కూడా ఓ చిన్నపిల్లాడు బయటకు వస్తాడు. సరదాగా పూల్ చేయడం కోసం గాలి వార్తలు అల్లుతూ ఆ పిల్లాడు అల్లరి చేస్తుంటాడు. అందుకే.. ఏప్రిల్ అంటేనే.. అల్లరి నెల. […]
[…] […]
[…] Gudimallam Lingam: హిందువులలో పరమశివుడిని ఎంత భక్తితో పూజిస్తారో అందరికీ తెలిసిందే. హిందువుల ప్రధాన దేవుళ్లలో శివుడు మొదటి స్థానంలో ఉన్నాడు. కేవలం ఇండియాలోనే కాదండోయ్.. ప్రపంచ వ్యాప్తంగా కూడా శివుడికి చాలా గుడులు ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు పురాతన విగ్రహాలు, గుడులు బయటపడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. […]
[…] KCR vs BJP: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధం తాజాగా మళ్లీ మొదలైంది. కేసీఆర్ బీజేపీని టార్గెల్ చేసుకుని మరోసారి పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఆయన మరోమారు మీడియా ముందుకు వస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలే లక్ష్యంగా విమర్శలు చేసేందుకు కదులుతున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశాన్ని దేశవ్యాప్తంగా ఎండగట్టాలని భావించినా అది నెరవేరలేదు. దీంతో ఇంకోసారి కూడా ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకోనున్నారు. […]
[…] […]