Chanakya Nithi: ఈ తప్పులు చేస్తే భార్యాభర్తలు విడిపోతారట.. చాణుక్యుడు చెప్పిన నీతి సూత్రాలివే?

Chanakya Nithi: భార్యాభర్తల బంధం బలంగా ఉంటే మాత్రమే భార్య, భర్త జీవితాంతం సంతోషంగా జీవనం సాగించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే కొన్ని తప్పులు చేస్తే మాత్రం భార్య, భర్త కలిసి ఉండే అవకాశం కంటే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాణుక్యుడు వెల్లడించారు. భార్య భర్తకు, భర్త భార్యకు తమపై, తమ ప్రవర్తనపై అసహ్యం కలిగించే విషయాలను తెలియజేయకూడదు. ఈ విషయాలను తెలియజేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు అయితే […]

Written By: Kusuma Aggunna, Updated On : April 23, 2022 11:55 am
Follow us on

Chanakya Nithi: భార్యాభర్తల బంధం బలంగా ఉంటే మాత్రమే భార్య, భర్త జీవితాంతం సంతోషంగా జీవనం సాగించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే కొన్ని తప్పులు చేస్తే మాత్రం భార్య, భర్త కలిసి ఉండే అవకాశం కంటే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాణుక్యుడు వెల్లడించారు. భార్య భర్తకు, భర్త భార్యకు తమపై, తమ ప్రవర్తనపై అసహ్యం కలిగించే విషయాలను తెలియజేయకూడదు.

Chanakya Nithi

ఈ విషయాలను తెలియజేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి విషయాలలో తప్పులు చేస్తే బంధాలు బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. భార్య, భర్త ఇంట్లో అయినా బయట అయినా ఒకరినొకరు గౌరవించుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడితే ఇద్దరి మధ్య అన్యోన్యత దెబ్బ తింటుంది.

Chanakya

Also Read: Mumbai Indians’ defeat? : ముంబై ఇండియన్స్ ఓటమికి అసలు కారణాలేంటి?

ఒకరి విషయంలో మరొకరికి ఏదైనా సమస్య ఉంటే సామరస్యపూర్వకంగా చర్చించుకోవడం ద్వారా పరిష్కరించుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇద్దరూ చర్చించుకున్నా సమస్య పరిష్కారం కాకపోతే పెద్దల సహాయం కోరితే మంచిది. భార్య, భర్త బయట జరిగిన గొడవలను, వ్యక్తిగత సమస్యలను పిల్లలపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరిపై ఒకరు కోపంగా మాట్లాడటం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు.

భార్య భర్తతో, భర్త భార్యతో తరచూ అబద్ధాలు చెబుతున్నా బంధం బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. భార్య, భర్త ఏ సమస్య వచ్చినా మాట్లాడుకొని పరిష్కరించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటాయని చెప్పవచ్చు. భార్యాభర్తలు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Also Read: Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లీలల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?