Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాలు తెలియజేశారు. మనిషి జీవితంతో సంబంధమైన మనకు తెలియని విషయాలపై అవగాహన కల్పించారు. మనకు ఎదురయ్యే సమస్యలపై ఎలా బయటపడాలో కూడా మార్గాలు చూపించారు. వాస్తు ప్రకారం ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో తెలిపారు. పక్కా వాస్తు ప్రకారం కట్టుకున్నా కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఇల్లును అనువైన చోట మాత్రమే నిర్మించుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. ఇల్లు కట్టుకునే క్రమంలో కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని ఇంటి నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చాటిచెప్పాడు.
ఇల్లు కట్టుకునే ప్రదేశంలో నీరు ఎక్కువగా లేకపోతే ఇబ్బందులే. నీటి లభ్యత లేని చోట ఇల్లు నిర్మించుకుంటే భవిష్యత్ లో కష్టాలే. ఇల్ల కట్టుకునే చోట చెరువు, కుంట లాంటివి ఉంటే ఇంకా మేలే. లేకపోతే ఇల్లు కట్టుకున్నాక సమస్యలు వస్తాయి. నీటి కోసం ఎంతో దూరం వెళ్లాల్సి వస్తే చిక్కులు తప్పవు. అలాంటి సమస్య మనకు రాకుండా ఉండాలంటే మన ఇల్లు నీరు ఉన్నచోట కట్టుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది. ఎప్పుడైనా మన ఇల్లు నీరు పుష్కలంగా ఉండే చోటనే నిర్మించుకునేందుకు నిర్ణయించుకోవాలి.
మనదేశం ఎన్నో మతాలకు ఆలవాలం. అన్ని మతాల వారు వారి విశ్వాసాలను పెంపొందించుకుంటారు. మత విశ్వాసాలు లేని చోట నివాసం ఏర్పాటు చేసుకోవద్దు. మత విశ్వాసాలు ఉన్న చోట ఉంటే భక్తి భావం ఉంటుంది. దీంతో మనలో కూడా మంచి ప్రవర్తన అలవడుతుంది. అందరితో కలిసి భక్తి భావం పెంచుకోవచ్చు. తద్వారా భగవంతుని సేవలో తరించే అవకాశం ఉంటుంది. అందుకే మత విశ్వాసాలు మంచిగా ఉన్న చోట మనం ఇల్లు కట్టుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
ఊరికి దూరంగా కూడా ఉంటే మనకు నష్టమే. ఎందుకంటే ఎవరు మనతో కలవరు. ఊళ్లోనే కట్టుకుంటే అందరితో కలిసి ఉండొచ్చు. ఎలాంటి సమస్య వచ్చినా సమాజంలో ఒకరిగా ఉండేందుకు వీలుంటుంది. చాలా మంది ప్రశాంతంగా ఉండాలంటే ఊరికి దూరంగా ఉండాలని కోరుకుంటారు కానీ అందులో నిజం ఉండదు. ఊరిలోనే కట్టుకుంటే అందరితో కలిసి ఉంటే ఆర్థిక ఇబ్బందులు కూడా రావు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా అందరి తోడులో ఉండటంతో ఎంతటి కష్టమొచ్చినా అందరు తోడుంటారనే ధైర్యం ఉంటుంది.
మనం ఇల్లు కట్టుకునేటప్పుడే దగ్గరలో ఆస్పత్రి ఉందా లేదా అనే విషయం చూసుకోవాలి. మనకు ఏదైనా జబ్బు చేస్తే దగ్గరలో మంచి ఆస్పత్రి లేకపోతే దూరం వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని తెలుస్తోంది. అందుకే మనకు అందుబాటులో హాస్పిటల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు వస్తాయని తెలిసిందే. దగ్గరలో ఆస్పత్రి లేకపోతే ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా నిష్ర్పయోజనమే అని చెబుతారు. దీంతోనే మనకు కూతవేటు దూరంలోనే దవాఖాన ఉంటేనే మేలని తెలుసుకోవాలి.
వాతావరణం బాగా లేకపోతే కూడా ఇబ్బందే. మనం ఇల్లు కట్టుకున్న చోట పరిస్థితులు బాగుండకపోతే భవిష్యత్ లో కూడా సమస్యలే వస్తాయనడంలో సందేహం లేదు. అలాంటి మనకు అనువైన వాతావరణం లేకపోతే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రాకపోవడమే మంచిదని గ్రహించుకోవాలి. మంచి వాతావరణం ఉన్న చోటే నిర్మించుకోవడానికి మొగ్గు చూపాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. మనం ఇల్లు కట్టుకునేందుకు అనువైన పరిస్థితులు ఉంటేనే ప్రయోజనకరంగా ఉంటుందనడంలో ఎలాంటి అనుమానాలు లేవని గ్రహించుకుంటే మంచిది.