Spend Money: మనం జీవితంలో హాయిగా జీవించాలంటే డబ్బు అవసరమే. బాగా కాకుండా మన ఖర్చులకు సరిపోయే విధంగా డబ్బు సంపాదించాలి. లేదంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. జీవితం ఆహ్లాదకరంగా ముందుకు పోవాలంటే డబ్బు కావాలి. డబ్బు పొదుపు చేయడం వల్లే భూమి, బంగారం లాంటివి కొనుగోలు చేస్తాం. వాటితో కష్టాలు లేకుండా జీవనం సాగిస్తాం. అన్నిటికి ధనమే ప్రధానం. అందుకే ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఏవో పనులు చేస్తుంటారు. కష్టపడి పనిచేసి ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటారు. దాన్ని పొదుపుగా వాడుకుని ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని చూస్తుంటారు. ఆచార్య చాణక్యుడు డబ్బుతో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై స్పష్టత ఇచ్చాడు.
పొదుపు చేస్తేనే..
మనం ఎంత సంపాదించినా ఎంతో కొంత పొదుపుచేయాలి. లేకపోతే భవిష్యత్ అవసరాలకు సరిపోదు. దీంతో మనకు కష్టాలు రావడానికి కారణమవుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడాలంటే ఆదాయంపై దృష్టి సారించాలి. మనం ఎంత సంపాదిస్తున్నాం? ఎంత ఖర్చు చేస్తున్నాం? అనే విషయాలపై అవగాహన ఉండాలి. మనం సంపాదించేదానికన్నా ఖర్చు అధికంగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం ఖాయం. అందుకే మన ఖర్చులను తగ్గించుకుని కొంత పొదుపు చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకోవాలి.
సాయం చేయొచ్చు
మనం సంపాదించే సంపాదనలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడే వారికి ఎంతో కొంత సాయం చేయడం మంచిదే. ఇంకా దేవాలయాలు, మతపరమైన వాటికి విరాళాలు ఇవ్వడం కూడా మంచిదే. దీంతో మనకు జీవితంలో సానుకూలత వస్తుంది. దేవుడు మనకు ఆశీర్వచనాలు ఇస్తే మనం ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. మనకు దైవ చింతన ఉంటే దేవుడు మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తాడని నమ్మకం. ఇలా ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పాడు.
ఇంకా వేటికి..
చాణక్యుడి ప్రకారం మనం ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తే సామాజిక కార్యక్రమాలకు వినియోగించడం సబబే. బాగా డబ్బు ఉన్న వారు ఆస్పత్రులు, పాఠశాలలకు ఎంతో కొంత సాయం చేస్తే మనకు మంచి జరుగుతుంది. మన గౌరవం ఇనుమడిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మర్యాద బాగుంటుంది. అందరు ఎంతో గౌరవంగా చూస్తారు. అపాత్ర దానం చేయడం వల్ల మనకు నష్టాలే కాని లాభాలు రావు. అందుకే మన సంపాదన సక్రమ మార్గంలో ఖర్చు చేయాలంటే చాణక్యుడు సూచించిన విధంగా దానాలు చేయడం వల్ల కూడా మనకు ఎంతో మేలు కలుగుతుంది. పదిమంది నోటిలో మన పేరు నానడం కూడా మన మంచికే. ఇలా చాణక్యుడు మనిషి జీవితంలో డబ్బు వినియోగం గురించి ఎన్నో విషయాలు వివరించాడు.