
Romance: కామా తురానాం భయం నలజ్జ అంటే కామంతో కళ్లు మూసుకుపోయినప్పుడు సిగ్గు, మానం గుర్తుకు రావు. కేవలం కామంతో రగిలిపోయేవారికి ఇవన్నీ పట్టవు. తమ సుఖమే ప్రధానం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర: అంటారు. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానమని దాని అర్థం. మనం గురువుకు ఇచ్చే గౌరవం ఇది. తల్లిదండ్రులు కూడా కొడితే ఓర్చుకోం. కానీ గురువు కొడితే ఏం మాట్లాడం. ఎందుకంటే మనకు చదువు రావాలి కాబట్టి. అంతటి మహత్తర స్థానం ఇచ్చిన గురువే దారి తప్పితే. కంచే చేసును మేస్తే ఇక చేసేదేముంటుంది. కలికాలంలో చోద్యాలు జరగడం మామూలే. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలే కామంతో కోరికలు తీర్చుకోవాలని భావిస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి.
ఆసక్తి గొలుపుతున్న..
తాజాగా ఫ్లోరిడాలోని విన్ త్రోప్ కాలేజ్ ప్రిపరేటరీ అకాడమీలో పైజ్ మోర్లీ (22) అనే యువతి ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. తాను చక్కగా పాఠాలు చెప్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఆమె బుద్ధి వక్రమార్గం పట్టింది. పాఠశాలలో చదువుకునే ఓ విద్యార్థిపై ఆమె కన్ను పడింది. ఇంకేముంది అతడితో శృంగార పాఠాలు వళ్లించింది. పాఠశాల తీరిక సమయాల్లో అతడితో రాసలీలలు కొనసాగించింది. వ్యవహారం ఇలా సాగుతున్న క్రమంలో విషయం యాజమాన్యానికి తెలిసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకుంది. ఆమెను విధుల నుంచి తప్పించింది.
మన తెలుగు రాష్ట్రాల్లోనూ..
తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. పాఠాలు చెప్పి వారిని మంచి వారిగా తయారు చేయాల్సిన పవిత్రమైన బాధ్యతలో ఉన్నా వారి బుద్ధి పక్కదారి పడుతోంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వారే ప్రేమ పాఠాలు చెప్పడంతో విద్యావ్యవస్థ భ్రష్టుపడుతోంది. మానవతా విలువలు మంట గలుస్తున్నాయి. తమ సుఖమే ప్రధానంగా ఇలాంటి ఘటనలకు తావిస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గని నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఏమనకుంటారనే కనీస ఆలోచన కూడా లేకుండా వక్రబుద్ధితో ఆలోచిస్తూ వృత్తికే కళంకం తెస్తున్నారు.
విస్తు గొలుపుతున్న..
తాజాగా అమెరికాలో ఓ పదమూడేళ్ల బాలుడిని 31 ఏళ్ల యువతి ఇంటికి పిలిపించుకుని పలుమార్లు అతడితో లైంగిక చర్యలో పాల్గొని అతడి వల్ల గర్భం దాల్చడం సంచలనం కలిగించింది. పసిమొగ్గలపై ఇలా చేయడం క్షమించరాని నేరంగా పరిగణిస్తున్నా ఏం చేయలేని దుస్థితి. ఇంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ఆడవారి ఆలోచనలు ఉండటం గమనార్హం. చిన్నారులనే లక్ష్యంగా చేసుకుని వారి లైంగిక కోరికలు తీర్చుకోవడం ఏమిటి? కావాలంటే వారికి పెద్దవారు దొరకడం లేదా? మంచి భవిష్యత్ ఉన్న బాలురనే టార్గెట్ చేసుకుని వారి కామ కలాపాలు కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి.