https://oktelugu.com/

Chanakya Neeti : చాణక్య నీతి: జీవితాన్ని నాశనం చేసే ఆ నాలుగు విషయాలు ఏంటో తెలుసా?

జీవితంలో ఎదగాలంటే ఏ విషయాలు వదిలిపెట్టాలి? వేటిపై దృష్టి పెట్టాలనే వాటిపై కూలంకషంగా వివరించాడు. వాటిని వదిలేస్తేనే మన మనుగడ సాధ్యమవుతుంది. అంతేకాని వాటిని పట్టుకుంటే మనం ఎదగడం కష్టమేనని తేల్చాడు. అందుకే వాటిని దూరంగా ఉంచడమే మంచిది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 20, 2023 / 07:21 PM IST
    Follow us on

    Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా ఎన్నో విషయాలు బోధించాడు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు దూరం చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సూచించాడు. జీవితంలో ఎదగాలంటే ఏ విషయాలు వదిలిపెట్టాలి? వేటిపై దృష్టి పెట్టాలనే వాటిపై కూలంకషంగా వివరించాడు. వాటిని వదిలేస్తేనే మన మనుగడ సాధ్యమవుతుంది. అంతేకాని వాటిని పట్టుకుంటే మనం ఎదగడం కష్టమేనని తేల్చాడు. అందుకే వాటిని దూరంగా ఉంచడమే మంచిది.

    శుభ్రత లోపించడం

    ఇంట్లో అశుభ్రంగా ఉండకూడదు. వస్తువులు చిందర వందర పడేయకూడదు. ఒక క్రమంలో ఉంచుకోవాలి. ఎలా పడితే అలా ఉంచుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలువుండదు. చాణక్యుడి ప్రకారం అశుభ్రంగా మారిన ఇంట్లో డబ్బు ఉండదు. మనశ్శాంతి లోపిస్తుంది. గొడవలు జరుగుతుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇన్ని రకాల నష్టాలు రావడానికి అపరిశుభ్రతే కారణంగా నిలుస్తుంది.

    అబద్ధాలు

    చాలా మంది అసలు నిజాలు చెప్పడమే మరచిపోయారు. తెల్లవారింది మొదలు ప్రతి మాటకు అబద్ధాలు ఆడటమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం అబద్ధాలు ఆడే వారు నిజాయితీగా ఉండరు. వారి బతుకంతా అబద్ధాలతోనే నిండిపోతోంది. దీంతో వారి ఎదుగుదల ప్రశ్నార్థకంలో పడుతుంది. అసత్యాలు చెప్పేవారి వెంట లక్ష్మీదేవి ఉండదు.

    సూర్యాస్తమయం సమయంలో..

    సూర్యాస్తమయం సమయంలో భోజనం చేయకూడదు. నిద్ర పోకూడదు. ఇవి రెండు చేస్తే అరిష్టమే. సంధ్యాసమయంలో నిద్రించడం, తినడం రెండు తప్పే. పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. ఒకవేళ చేస్తే దారిద్ర్యం తాండవిస్తుంది. ఇలా చేస్తే పేదలుగానే ఉంటారు. ధనవంతులు కాలేరు. చాణక్యుడి ప్రకారం లక్ష్మీ అనుగ్రహం వీరిపై ఉండదు. పొరపాటున కూడా సూర్యాస్తమయం సమయంలో ఈ పనులు చేయకండి.

    బద్ధకం

    జీవితంలో బద్ధకంతో ఉన్న వ్యక్తి దేన్ని సాధించలేడు. సోమరితనం వీడితేనే ముందుకు వెళ్లొచ్చు. బద్ధకం ఓ చెడ్డ అలవాటు. జీవితంలో విజయం సాధించాలంటే సోమరితనాన్ని దూరం చేసుకుంటే మంచిది. చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తి అయితే బద్ధకంగా ఉంటాడో అతడు జీవితంలో దేన్ని సాధించడానికి అవకాశం లేదు. అందుకే బద్ధకాన్ని దూరం చేసుకుంటేనే చలాకీతనం అలవడుతుంది. దీంతో విజయాలు దక్కుతాయి.