https://oktelugu.com/

Cancer: క్యాన్సర్ కు ఉచితంగా చికిత్స పొందే అవకాశం.. ఎక్కడో తెలుసా?

Cancer: ప్రపంచ దేశాల్లో ప్రతి సంవత్సరం వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్న వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి. ప్రాణాంతక క్యాన్సర్‌ బారిన పడ్డామంటే కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. మెల్లగా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తూ క్యాన్సర్ ప్రాణాలను హరిస్తుంది. అయితే క్యాన్సర్ చికిత్సలో కొత్తకొత్త వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. సరికొత్త విధానాల వల్ల వ్యాధి తీవ్రత తగ్గడంతో పాటు ఆయుష్షు పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులలో ఏకంగా పది […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 6, 2021 / 11:45 AM IST
    Follow us on

    Cancer: ప్రపంచ దేశాల్లో ప్రతి సంవత్సరం వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్న వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి. ప్రాణాంతక క్యాన్సర్‌ బారిన పడ్డామంటే కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. మెల్లగా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తూ క్యాన్సర్ ప్రాణాలను హరిస్తుంది. అయితే క్యాన్సర్ చికిత్సలో కొత్తకొత్త వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. సరికొత్త విధానాల వల్ల వ్యాధి తీవ్రత తగ్గడంతో పాటు ఆయుష్షు పెరిగే అవకాశాలు ఉంటాయి.

    ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులలో ఏకంగా పది లక్షల రూపాయలు ఖర్చయ్యే స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్సను నిమ్స్ వైద్యులు ఉచితంగా చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఆస్పత్రిలో స్టెమ్ సెల్ విభాగం ఏర్పాటైంది. నిమ్స్‌ దవాఖాన ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సదాశివుడు మాట్లాడుతూ ఈ చికిత్సకు నెలరోజుల సమయం పడుతుందని వెల్లడించారు. గత నెలలో స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ద్వారా ఏడుగురికి చికిత్స అందించామని చెప్పుకొచ్చారు.

    భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో ఈ విధానమే కీలకం కానుందని సదాశివుడు తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ ద్వారా ఉచితంగా ఈ చికిత్సను పొందవచ్చని సదాశివుడు చెప్పుకొచ్చారు. ఈ చికిత్స తర్వాత క్యాన్సర్ రోగులు సాధారణ జీవితం గడపవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. నిమ్స్ లో ప్రస్తుతం స్టెమ్ సెల్స్ ను భద్రపరచడానికి ఆధునిక ల్యాబ్ ను సైతం తయారు చేస్తున్నామని సదాశివుడు తెలిపారు.

    త్వరలోనే ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని సదాశివుడు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే నామమాత్రంగా ఛార్జీలను వసూలు చేస్తున్నామని సదాశివుడు చెప్పుకొచ్చారు.