Homeఅంతర్జాతీయంCancer vaccine : వైద్యరంగంలో మరో అద్భుతం.. క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌.. అక్కడి వారికి ఉచితం..!

Cancer vaccine : వైద్యరంగంలో మరో అద్భుతం.. క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌.. అక్కడి వారికి ఉచితం..!

Cancer vaccine: ఒకప్పుడు ఇంటి పంట.. ఇంట్లో వండిన వంటను మాత్రమే తినేవారు. రసాయనాలు లేని పంటలు పండించేవారు. ఎలాంటి విషతుల్యం కాని పాలు తాగేవారు. నిల్వ చేయని మాంసం తినేవారు. దీంతో అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు తక్కువగా వచ్చేవి. కానీ, మారుతున్న కాలంతో జీవన శైలిలోనూ మార్పులు వస్తున్నాయి. వ్యవసాయంలో రసాయనాల వినియోగం విపరీతంగా పెరిగింది. పాలను రసాయనాలతో నిల్వ చేస్తున్నారు. వాటినే మనం తాగుతున్నాం. ఇక మాసం కూడా ఫ్రీజ్‌ చేసి అమ్ముతున్నారు. ఇలా అన్ని ఆహార పదార్థాలు కలుషితం అవుతున్నాయి. దీంతో దీర్ఘకాలిక వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఇందులో క్యాన్సర్‌ ఒకటి. ఇటీవలి కాలంలో క్యాన్సర్‌ వాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. వ్యాధికి అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా.. చాలా మంది వ్యాధితో మృతిచెందుతున్నారు. ఇందుకు కారణం.. వ్యాధిని తొలి దశలోనే గుర్తించకపోవడం. ఈ తరుణంలో వైద్యరంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇందుకు రష్యా కేంద్రంగా మారింది. క్యాన్సర్‌ను నయం చేసే వ్యాక్సిన్‌ను రూపొందించింది. అంతేకాదు.. దీనిని దేశంలోని రోగులకు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారితంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తామని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున రేడియాలజీ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ జనరల్‌ డైరెక్టర్‌ అండ్రే కప్రిన్‌ ప్రకటించారు.

ఎలా పని చేస్తుందంటే..
కరోనా నుంచి రక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొన్ని టీకాలు మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ(ఎంఆర్‌ఎన్‌ఏ) పోగుల ఆధారంగా పనిచేస్తాయి. అవి కరోనా వైరస్‌ను గుర్తించేలా మానవ రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. అలాగే రష్యా తయారు చేసిన క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ కూడా ఇదే తరహాలో పనిచేస్తుంది. ఆర్‌ఎన్‌ఏ(రిబో న్యూక్లియర్‌) అనేది ఒక పాలిమెరిక్‌ అణువు. ఇది జీవ కణజాలంలో చాలా జీవ సంబంధమైన విధులకు అవసరం. మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ పీస్‌ను వ్యాక్సిన్‌ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. తద్వారా కణాను ఒక నిర్ధిష్టమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ ఈ ప్రొటీన్‌ను గుర్తిస్తుంది. దానితో పోరాడడానికి ప్రతినిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే క్యాన్సర్‌ కణాలను గుర్తించి దాడిచేస్తుంది.

ఏఐ సహాయంతో..
వ్యాక్సిన్‌ తయారీలో ఏఐ పాత్ర కూడా ఉంది. పర్సనలైజ్డ్‌ వ్యాక్సిన్లను రూపొందించడానికి ఏఐ ఆధారిత న్యూరల్‌ నెట్వర్క్‌ గణనలు అవసరమైన సమయాన్ని తగ్గించలవని, ఈ ప్రక్రియ కేవలం గంటలోపే పూర్తి చేయగలదని ప్రకటించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular