https://oktelugu.com/

Cancer: జీవితంలో క్యాన్సర్, గుండె జబ్బులు రాకూడదు అంటే.. ఇది తినండి !

Cancer:  రోజువారీ జీవనంలో మనం కొన్ని కూరగాయలని నిర్లక్ష్యం చేస్తూ వాటిని తినడానికి కూడా ఇష్టపడం. అలాంటి ఐటమ్ లో ముల్లంగి కూడా ఒకటి. కానీ, ముల్లంగితో ఎంతో మేలు జరుగుతుంది. ముల్లంగి లోని పోషకాలు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో గొప్పది. మరి అవేంటో చూద్దామా ! మీకు తెలుసా ? ముల్లంగి మన శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతుంది. అంటే.. మన శరీరాన్ని క్లీన్ చేస్తోంది అన్నమాట. ముల్లంగి చేసే మరో అద్భుతమైన పని. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 14, 2022 / 12:03 PM IST
    Follow us on

    Cancer:  రోజువారీ జీవనంలో మనం కొన్ని కూరగాయలని నిర్లక్ష్యం చేస్తూ వాటిని తినడానికి కూడా ఇష్టపడం. అలాంటి ఐటమ్ లో ముల్లంగి కూడా ఒకటి. కానీ, ముల్లంగితో ఎంతో మేలు జరుగుతుంది. ముల్లంగి లోని పోషకాలు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో గొప్పది. మరి అవేంటో చూద్దామా !

    Cancer

    మీకు తెలుసా ? ముల్లంగి మన శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతుంది. అంటే.. మన శరీరాన్ని క్లీన్ చేస్తోంది అన్నమాట.

    ముల్లంగి చేసే మరో అద్భుతమైన పని. శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కాపాడుతుంది.

    Also Read:  దిల్ రాజు అంటేనే అసలు వాడకానికి ప్రతి రూపం !

    ఇక ముల్లంగిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అవును, ఇది ఆశ్చర్యం అనిపించినా పచ్చి నిజం. విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు ఉండే ముల్లంగి లో పిండి పదార్థాలు సున్నా. బరువు తగ్గాలనుకునేవారికి ముల్లంగి చక్కని ఆహారం. అందుకే పోషకాహార నిపుణులు ముల్లంగిని ఎక్కువగా తినమని సలహా ఇస్తుంటారు.

    కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు నివారించడంలో కూడా ఈ దుంప కూర అద్భుతంగా పనిచేయగలదు. ముల్లంగి లో ఉండే యాంటీ ఫంగల్ గుణాలే అందుకు కారణం.

    ముల్లంగిలో ఉండే విటమిన్ సి, జింక్, ఫాస్ఫరస్ వంటివి మన చర్మం పొడిబారకుండా చేస్తాయి. అలాగే మొటిమల్ని నివారించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

    ముల్లంగిలో ఫ్లేవనాయిడ్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చేస్తాయి. అందుకే ముల్లంగి గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. ముల్లంగిని పదార్ధాలు గానే కాదు, సలాడ్ల రూపంలో కూడా హాయిగా తినొచ్చు.

    Also Read: పంజాబ్ లో సీఎం అభ్యర్థి ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణకు రెడీ

    Tags