YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఇప్పుడు ఏదో ఒక కొత్త అంశం కావాలి. ప్రజా ఉద్యమాలకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. అయితే ఉద్యమాల మాట అటు ఉంచితే ఇప్పుడున్న ప్రభుత్వం పై విషం చిమ్మాలి. బురద జల్లాలి. దాంట్లో సత్యం అసత్యం అన్నమాట పక్కన పెడితే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశాన్ని తీసుకుందాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా దానిని ముందుకు తీసుకెళ్లాలనుకుంది కూటమి. అంతకుముందు చాలా వ్యవస్థలు అలానే పనిచేసాయి. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్యశ్రీ, 108, వన్ జీరో ఫోర్ వ్యవస్థలన్నీ అలానే పనిచేసాయి. జగన్మోహన్ రెడ్డి సైతం ఆ విధానంతోనే ముందుకు వెళ్లారు. ఇప్పుడు కూటమి ఆ మాట అనేసరికి ప్రైవేటీకరణ అంటూ ప్రజల మధ్యకు వెళ్లి గగ్గోలు పెడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నుంచి ఆ పార్టీకి అదే పని. ప్రతి వారంతో పాటు నెలకు ఈ రకమైన ఆందోళనలు ఇకనుంచి ఉంటాయి కూడా.
గుడివాడ అమర్నాథ్ కొత్త గోల..
ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి, విశాఖ పై ( Visakhapatnam) పడింది. విశాఖ బ్రాండ్ ఇమేజ్ కూటమి ఎమ్మెల్యేల పుణ్యమా అని పోతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గగోలు పెడుతున్నారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని కూడా చెబుతున్నారు. తన సొంత పార్టీ ఎమ్మెల్యేలే సెటిల్మెంటులు చేస్తున్నారని స్వయంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని చెప్పుకొస్తున్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలు కోరడం ఇప్పుడు వింతగా ఉంది. అయితే ఇప్పుడు ఈ విశాఖకు పెట్టుబడులు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అది కనిపిస్తోంది. గుడివాడ అమర్నాథ్ గతాన్ని గుర్తు చేసుకోవాలని ఎక్కువ మంది హితవు పలుకుతున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసిపి హయాంలో జరిగిన అవినీతితో పాటు భూ కబ్జాలు గురించి జనాలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ అవి ఇప్పుడు అమర్నాథ్ లాంటి వారికి చెవికి ఎక్కవు కూడా.
గుడ్డకు ఈకలు పీకే పని..
వైయస్సార్ కాంగ్రెస్ నేతలు విశాఖ అని మాట ఎత్తితే ద్వంద అర్ధాలు వినిపిస్తాయి. వారికి ప్రత్యర్థులు మాట్లాడాల్సిన పనిలేదు. ఏకంగా సామాన్య జనాలు సైతం వైసీపీ చర్యలను తిప్పి కొడతారు. మూడు రాజధానులంటూ ఏపీ నవ్వుల పాలు చేసి తీరని నష్టాన్ని కలిగించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. విశాఖ రాజధాని అంటే రుషికొండ ప్యాలెస్ మాత్రమే అని భావించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎలాంటిదో అందరికీ తెలుసు. అప్పుడే విశాఖ బ్రాండ్ ఇమేజ్ ఎంతగా దెబ్బతిందో కూడా తెలుసు. విశాఖకు ఇప్పుడు వస్తున్న గౌరవం చూసి ఇదే వైసిపి అమరావతి రైతుల్లో చిచ్చు రేపుతోంది. రాయలసీమ ప్రజల్లో వైషమ్యాన్ని నింపుతోంది. అయితే ఇప్పుడు కొత్తగా కూటమి వల్ల బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుంది అంటూ వైసీపీ నేతలు గుడ్డకి ఈకలు పీకేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారికి తెలియనిది ఏమిటంటే ప్రజలు కూడా గుర్తిస్తున్నారు అని. నేటికీ కూడా విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని. వైసీపీ ది మొసలి కన్నీరు అని తెలుసుకుంటున్నారన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు గుడివాడ అమర్నాథ్ లాంటి గుడ్డు నేతలు.