Money Plant: మనీప్లాంట్ పెంచుకుంటే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతామా?

Money Plant: ప్రస్తుత కాలంలో ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. అందరికి డబ్బు సమస్య ఎక్కువవుతోంది. సంపాదించిన సొమ్ము ఊడ్చినట్లుగా ఖర్చవుతుందని బాధపడుతున్నారు. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తుందని తెగ విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలేంటని తెలుసుకుంటే ఖర్చులు పెరగడమే తప్ప ఇంకో కారణం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో డబ్బు సంపాదనపై చాలా మంది ఫోకస్ పెడుతున్నారు. తమ ఖర్చులకనుగుణంగా డబ్బు కావాలని ఆశిస్తున్నారు. దీని కోసం కొన్ని పరిహారాలు కూడా పాటిస్తున్నారు. మనీప్లాంట్ […]

Written By: Srinivas, Updated On : April 18, 2023 4:23 pm
Follow us on

Money Plant

Money Plant: ప్రస్తుత కాలంలో ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. అందరికి డబ్బు సమస్య ఎక్కువవుతోంది. సంపాదించిన సొమ్ము ఊడ్చినట్లుగా ఖర్చవుతుందని బాధపడుతున్నారు. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తుందని తెగ విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలేంటని తెలుసుకుంటే ఖర్చులు పెరగడమే తప్ప ఇంకో కారణం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో డబ్బు సంపాదనపై చాలా మంది ఫోకస్ పెడుతున్నారు. తమ ఖర్చులకనుగుణంగా డబ్బు కావాలని ఆశిస్తున్నారు. దీని కోసం కొన్ని పరిహారాలు కూడా పాటిస్తున్నారు.

మనీప్లాంట్

మన వాస్తు శాస్త్రంలో మనీప్లాంట్ కు మంచి ప్రాధాన్యం ఉంది. దీంతో డబ్బుకు ఇబ్బందులు లేకుండా చేస్తుందని నమ్ముతుంటారు. ప్రతి ఒక్కరు తమ ఇంటిలో మనీప్లాంట్ ను పెంచుకుని ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవాలని భావిస్తున్నారు. మనీప్లాంట్ మొక్కను మన ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి అందరు మొగ్గు చూపుతున్నారు.

ఏ దిక్కులో..

మనీ ప్లాంట్ ను ఏ దిక్కులో పెంచుకోవాలి. ఎటు వైపు నాటుకుంటే మంచి ఫలితాలు వస్తాయనే దానిపై వాస్తుశాస్త్రంలో స్పస్టంగా చెప్పారు. దీన్ని ఉత్తరం, తూర్పు దిక్కుల్లో నాటుకోకూడదు. దక్షిణం వైపు మాత్రమే దీన్ని నాటాలి. దీని తీగలు నేలను తాకకుండా చూసుకోవాలి. పందిరి వంటిది వేసి తీగలు దాని మీద ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Money Plant

లక్ష్మీదేవి కటాక్షం

మనీప్లాంట్ ఉన్న ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెబుతారు. దీంతో మనీప్లాంట్ ను పెంచుకుని తమ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలని అనుకుంటారు. మనీప్లాంట్ మన సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతుంటారు. ఇందులో భాగంగానే ప్రతి ఇంటిలో మనీప్లాంట్ మొక్క నాటుకుని తమ ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం పొందాలని ఆశిస్తున్నారు.