Stress : ఈ రోజుల్లో ఎక్కువ ఒత్తిడికి గురి అవుతున్నారు ప్రజలు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక విషయంతో ఒత్తిడికి గురి అవుతున్నారు. బాస్ చీవాట్లు, తల్లిదండ్రి తిట్లు, గర్ల్ ఫ్రెండ్/ భాయ్ ఫ్రెండ్ బాధలు, స్నేహితుల దోస్తానా? ఇలా ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధంగా టెన్షన్ ఉంటుంది. చిన్న పిల్లలకు చిన్నగా, పెద్ద వారికి పెద్దగా కానీ టెన్షన్ మాత్రం పక్కా బాస్. మరి ఈ ఒత్తిడి ఎన్నో సమస్యలను తెస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం కూడా ఈ ఒత్తిడే అవుతుంది. ఒత్తిడి మీ మనస్సును మాత్రమే ప్రభావితం చేయదు. ఇది మీ నోటి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది అంటున్నారు నిపుణులు. దంతాలు గ్రైండింగ్ నుంచి చిగుళ్ల సమస్యల వరకు, దీర్ఘకాలిక ఒత్తిడి తీవ్రమైన దంత సమస్యలకు దారి తీస్తుందట. మీ నోటి ఆరోగ్యాన్ని ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దంతాల గ్రైండింగ్ : గ్రెండింగ్ ఏంటి అనుకుంటున్నారా? దంత సమస్యల్లో ఇది కూడా ఒక సమస్యనే. ఒత్తిడి తరచుగా ఉంటే మాత్రం ఈ సమస్యలు వస్తాయి. దంతాలు దెబ్బతినడానికి కారణం కూడా అవుతుంది ఈ ఒత్తిడి. గమ్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడితో ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీంతో చిగుళ్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది అంటున్నారు నిపుణులు. సో ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం. ఇక పొడి నోరు సమస్య కూడా వస్తుంది.
ఒత్తిడి-సంబంధిత మార్పులు లాలాజల ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఇది పొడిగా మారుతుంది.
నోటి పుండ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. పెరిగిన ఒత్తిడి కారణంగా అల్సర్లు లేదా క్యాన్సర్ పుళ్ళు వంటివి వస్తాయి అంటున్నారు నిపుణులు. దవడ నొప్పి కూడా వస్తుందట. దవడ కండరాలలో ఉద్రిక్తత ఏర్పడుతుంది. నిరంతర నొప్పి వస్తుంది.
నోటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయవద్దు. ఒత్తిడి వల్ల బ్రషింగ్, ఫ్లాసింగ్‌ను దాటవేయవద్దు. కావిటీస్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఒత్తిడి ఉంటే క్షయ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందట.
ఒత్తిడి అనేది దంత క్షయంతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఇది మన శరీరంలోని రక్షిత ఖనిజాలను బయటకు పంపుతుంది. నోటిలో ఆమ్ల, బ్యాక్టీరియాతో నిండిన, కుహరం కలిగించే వాతావరణాన్ని పెంచుతుంది. శారీరక ప్రభావం కాకుండా ఒత్తిడికి గురైనప్పుడు మనం తీసుకునే సరైన ఆహార ఎంపికల వల్ల కూడా మనం తరచుగా దంత క్షయ అవకాశాలను పెంచుతాము. ఒత్తిడికి గురైనప్పుడు, చాక్లెట్ లను తినాలి. ఇక ఈ సమయంలో ఆల్కహాల్ వంటి వాటికి అలవాటు పడతారు. వీటిని తీసుకుంటే దంతాల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.