https://oktelugu.com/

Nellore: ఇదెక్కడి చోద్యం.. మద్యం కోసం రోడ్డెక్కిన మహిళలు

మద్యం అంటేనే మహిళలు ఆగ్రహంతో ఊగిపోతారు. పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతుందని భావిస్తారు. మద్యం మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిస్తారు. కానీ ఆ గ్రామంలో మాత్రం మహిళలు ఆహ్వానించడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : December 5, 2024 / 05:28 PM IST

    Nellore

    Follow us on

    Nellore: ఎక్కడైనా మద్యం షాపు వద్దని మహిళలు ఆందోళన చేస్తారు. తమ ఇంట్లో మగవారు ముందుకు బానిసవుతారని భయపడతారు. తమ గ్రామంలో షాపు వద్దని ఆందోళన చేస్తారు. కానీ ఆ గ్రామంలో మాత్రం అంతా రివర్స్. మద్యం షాపు ఏర్పాటు చేయాలని కోరుతూ మహిళలు ఆందోళన బాట పట్టారు. వింతగా ఉంది కదూ ఇది నిజం. ఏపీలోని నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు నియోజకవర్గం గండిపాలెంలోమద్యం షాపు ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది.స్థానికంగా ఇద్దరు టిడిపి నేతలు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.గత నెల 27న వర్గం మద్యం షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ మహిళలతో నిరసన తెలిపింది. అయితే తాజాగా మరో వర్గం ఊరిలోనే మద్యం షాపు ఏర్పాటు చేయాలంటూ భారీగా మహిళలతో కూడలి దగ్గర నిరసనకు దిగడంచర్చకు దారితీసింది. ఏకంగా ఫ్లకార్డులతో నినాదాలు కూడా చేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది.

    * కొద్దిరోజుల కిందట నిషేధం
    సాధారణంగా మద్యం విక్రయాలను మహిళలు వ్యతిరేకిస్తుంటారు. తమ ఊరిలో షాపులు ఏర్పాటు చేయవద్దని నిరసనలకు దిగుతారు. ఇక్కడ మాత్రం మద్యం షాపు ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేయడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా మహిళలను తీసుకొచ్చి ఆందోళన చేయించారనే చర్చ జరుగుతోంది. 2013కు ముందు గండిపాలెంలో మద్యం షాపు ఉండేది. ఆ సమయంలో వివాదాలు జరిగేవి. మందుబాబులు కొట్లాటకు దిగేవారు. 2014లో అప్పటి సర్పంచ్ నాగేశ్వరి మద్యం షాపును మూసివేయాలని ఉద్యమం చేపట్టారు. దీంతో అక్కడ షాపును తొలగించారు. అప్పటినుంచి షాపు ఏర్పాటు చేయలేదు. కానీ ఇటీవల ప్రైవేటు మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించడంతో.. ఇక్కడ కొత్తగా షాపు ఏర్పాటు చేశారు.

    * వర్గ ఆధిపత్యం
    అయితే షాపు ఏర్పాటుకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఒక వర్గం షాపు ఏర్పాటు చేయాలని పట్టుబడుతోంది. మరో వర్గం మాత్రం ఇక్కడ వద్దంటోంది. గ్రామంలో మెజారిటీ ప్రజలు షాపు వద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక వర్గం వారు మహిళలను పెద్ద ఎత్తున సమీకరించి నిరసనకు దింపడం సంచలనం రేకెత్తిస్తోంది. సర్వత్రా చర్చకు దారితీస్తోంది.