https://oktelugu.com/

Nominated Posts : దసరాకు ముందే నామినేటెడ్ సందడి.. ఫార్ములాతో చంద్రబాబు సిద్ధం*

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.పెద్ద నేతలు అందరికీ పదవులు దక్కాయి.ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 16, 2024 10:23 am
    Nominated Posts

    Nominated Posts

    Follow us on

    Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి ప్రారంభమైంది. ప్రకటనకు తుది కసరత్తు జరుగుతోంది. కూటమిలోని మూడు పార్టీల మధ్య పదవుల పంపకం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పదవులను ప్రకటించాల్సి ఉన్నా.. మరోసారి వడపోత కోసం వాయిదా వేశారు. ఇప్పుడు దసరాకు ముందే పదవులు ప్రకటించేలా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. మూడు పార్టీల్లో ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నామినేటెడ్ పదవులు ఎంపికలో ఒక ఫార్ములాను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపికి 60 శాతం, జనసేనకు 30 శాతం, మిగిలిన 10% బిజెపికి కేటాయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులతో పాటు ఆలయ ట్రస్ట్ బోర్డుల నియామకాలు సైతం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. మూడు పార్టీలకు న్యాయం జరిగేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని ఈ పదవులు కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే పొత్తులో భాగంగా చాలామంది టీడీపీ నేతలుటిక్కెట్లు త్యాగం చేశారు. అటువంటి వారికి ముందుగా రాష్ట్రస్థాయి పదవులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎమ్మెల్సీలు, రాజ్యసభ పదవులు ఆశిస్తున్న వారినిమినహాయింపు ఇస్తున్నట్లు సమాచారం.

    * టిడిపిలో అవకాశాలు దక్కని వారికి
    ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది పోటీకి దూరమయ్యారు. పొత్తుల్లో భాగంగా మారిన సమీకరణలతో చాలామంది టిక్కెట్లు త్యాగం చేశారు. అటువంటి వారిలో దేవినేని ఉమా ఒకరు. ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్,పట్టాభికి పౌరసరఫరాల కార్పొరేషన్, మాజీమంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కు ఎస్టీ కమిషన్ పోస్టులు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

    * ఆలపాటి రాజాకు అమరావతి బాధ్యతలు
    జనసేనతో పొత్తు విషయంలో చాలామంది టిడిపి నేతలు వెనక్కి తగ్గారు. అందులో ఆలపాటి రాజా ఒకరు. జనసేన కీలక నేతనాదెండ్ల మనోహర్ కోసం ఆయన తెనాలి సీటును వదులుకున్నారు.అందుకే ఆలపాటి రాజాకు అమరావతికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 90 వరకు కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిలో చైర్మన్లు, అందులో మెంబర్లు కలిసి వందల్లో నే పోస్టులు ఉన్నాయి ఇవి ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేస్తారని తెలుస్తోంది. తొలి విడతగా 30%పదవులు ప్రకటిస్తారని సమాచారం.

    * ఈసారి 30% ప్రకటన
    ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల ప్రకటనకు సంబంధించి జాప్యం జరిగింది.ఆగస్టు 15 నాటికి ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఐ విఆర్ఎస్ ద్వారా సర్వే కూడా చేపట్టారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పేర్లను సహకరించారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు.అయితే సాంకేతికపరమైన అంశాలతో పాటు ఇటీవల వచ్చిన వరదలతో ఎప్పటికప్పుడు ఈ పోస్టుల ప్రకటనలో జాప్యం జరుగుతూ వచ్చింది.అయితే దసరాకు ముందే నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.