spot_img
Homeహెల్త్‌Neuroscience brain electricity: మన మెదడే ఓ ఎలక్ట్రిసిటీ.. దాంతో ఏం చేయొచ్చు అంటే..

Neuroscience brain electricity: మన మెదడే ఓ ఎలక్ట్రిసిటీ.. దాంతో ఏం చేయొచ్చు అంటే..

Neuroscience brain electricity: మనకు తెలిసిన వారిలో ఎవరికైనా ప్రతిభ ఎక్కువగా ఉంటే.. జిజ్ఞాస అధికంగా ఉంటే.. నీకేంట్రా బాబూ నీ మెదడు పాదరసం లాగా పని చేస్తూ ఉంటుంది.. నువ్వు ఏమైనా చేయగలవు.. దేన్నైనా గుర్తుపెట్టుకోగలవు అంటుంటాం. నిజానికి మన మెదడు అనేది అద్భుతమైన గని. అందులో ప్రతిది ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒక మనిషి తన పుట్టినప్పటినుంచి చివరి అంకం దాకా అన్ని విషయాలను దాదాపుగా గుర్తు పెట్టుకుంటున్నాడు అంటే మన మెదడుకు ఎంత కెపాసిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.

మన మెదడు కేవలం స్టోరేజ్ పాయింట్ మాత్రమే కాదు.. శరీరానికి ఎప్పటికప్పుడు సంకేతాలు ఇచ్చే మిషన్ కూడా. మనిషి మెదడు చిన్నపాటి విద్యుత్ కేంద్రం లాగా పనిచేస్తుంది. చదువుతుంటే వింతగా ఉన్నప్పటికీ.. ఇది నిజం. ఎందుకంటే మనం మేల్కొని ఉన్నప్పుడు మొదటి సుమారు 20 వాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇది చిన్నపాటి ఎల్ఈడి బల్బు వెలిగించడానికి ఉపయోగపడుతుంది. నాడుల మధ్య జరిగే రసాయనిక చర్యల వల్ల ఈ విద్యుత్ ఏర్పడుతుంది. శరీరంలో ఈ జీవ విద్యుత్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అందువల్లే శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతుంటారు.

జీవ విద్యుత్ అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే దీనివల్ల మెదడుకు ఎటువంటి హాని జరగదు. మెదడు అనేది మన శరీరానికి ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూ ఉంటుంది. నాడులను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆక్సిజన్ లభించని సమయంలో మెదడు సరిగా పనిచేయదు. ఆ సమయంలో మన దేహంలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. కాకపోతే అవి తాత్కాలికంగా ఉంటాయి. ఆక్సిజన్.. రక్తం వంటివి సరైన మోతాదులో లభించకపోతే శరీరం మీద ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందువల్లే మెదడుకు సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా సరే నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు అంటుంటారు.

విద్యుత్ ఏర్పడటం వల్ల మన శరీరానికి ప్రత్యేకంగా ఎటువంటి సంకేతాలు రావు. కాకపోతే నాడుల మధ్య రసానిక చర్యలు విద్యుత్ ఏర్పడేందుకు దోహదం చేస్తుంటాయి. రసానిక చర్యలు జరిగినప్పుడు విద్యుత్ ఏర్పడడం అనేది సహజమైన ప్రక్రియ. నాడులు సమాచారాన్ని వేగంగా తీసుకెళ్తాయి. అంతే వేగంగా మెదడుకు చేరవేరుస్తూ ఉంటాయి. ఇది నిరంతర సంధాన ప్రక్రియ. అందువల్లే ఒక మనిషి మనుగడ మెదడు పనిచేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి అన్ని రంగాలలో ముందున్నాడంటే.. అతడి మెదడు సక్రమంగా పనిచేస్తుందని అర్థం. ఒకవేళ అతడు ఇబ్బంది పడుతూ ఉంటే.. ఏదో లోపం ఉందని అర్థం. అందువల్లే ఏవైనా మానసిక సమస్యలు ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని పెద్దలు అనేది ఇందుకే..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version