Cardamom : యాలకులను ఇలా మరిగించి తాగండి.. మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు

Cardamom : మనం వంటింట్లో చాలా రకాల దినుసులు వాడుతుంటాం. అందులో యాలకులు ముఖ్యమైనవి. వీటితో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధంలా వాడతారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. గుండె సంబంధిత రోగాలకు చెక్ పెడతాయి. అందుకే యాలకుల వినియోగంపై శ్రద్ధపెట్టాల్సిందే. మన వంటల్లో వీటిని ఎక్కువగా వాడాల్సిందే. దీని వల్ల మనకు ఒనగూడే లాభాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో రోగాలు విజృంభిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో […]

Written By: Srinivas, Updated On : April 8, 2023 11:51 am
Follow us on

Cardamom : మనం వంటింట్లో చాలా రకాల దినుసులు వాడుతుంటాం. అందులో యాలకులు ముఖ్యమైనవి. వీటితో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధంలా వాడతారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. గుండె సంబంధిత రోగాలకు చెక్ పెడతాయి. అందుకే యాలకుల వినియోగంపై శ్రద్ధపెట్టాల్సిందే. మన వంటల్లో వీటిని ఎక్కువగా వాడాల్సిందే. దీని వల్ల మనకు ఒనగూడే లాభాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో రోగాలు విజృంభిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. ఈనేపథ్యంలో యాలకుల వినియోగంపై అందరు మక్కువ చూపాల్సిందే. యాలకులను మరిగించి తీసుకోవడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీని వల్ల మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి.

హార్ట్ ఎటాక్ తో గుండెకు రక్త సరఫరా మందగిస్తుంది. దీంతో రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వుతో గోడల్లో కొవ్వు అడ్డుగా నిలవడంతో గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతోంది. గుండె కొట్టుకునే శబ్ధాల్లో తేడాలురావడంతో గుండె తక్కువగా కొట్టుకోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒత్తిడి, ఆహార అలవాట్లు, జీవన శైలితో గుండె జబ్బుల సమస్య వస్తోంది. కానీ మనం నిర్లక్ష్యంతోనే ఉంటున్నాం. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

ప్రాసెస్ ఫుడ్స్ మనకు ఎన్నో నష్టాలు తెస్తున్నాయి. నూనెలో వేయించిన పదార్థాలతో ఆరోగ్యం దెబ్బ తింటుందని తెలిసినా మారడం లేదు. ఇంకా ఉప్పు కూడా ఎక్కువగా వాడుతున్నారు. మనం సగటున రోజుకు ఒక వ్యక్తి కేవలం ఐదు గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. కానీ మనం దాదాపు పది గ్రాముల ఉప్పు తింటున్నాం. దీంతో రోగాల బారిన పడుతున్నాం. అయినా మనం పట్టించుకోవడం లేదు. ఆరోగ్యాన్ని లెక్క చేయడం లేదు. దీని వల్ల ఎన్నో అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి.

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలు మూసుకుపోతున్నాయి. గుండె కండరాలు బిగుసుకుపోతున్నాయి. దీంతో రక్తం చిక్కబడుతుంది. మైదా, రవ్వ, అన్నం వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల రక్త సరఫరా మందగిస్తుంది. ఫలితంగా హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయి. గుండె సంబంధిత సమస్యలతో చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ మన అలవాట్లు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల నుంచి తప్పించుకోవాలంటే మనం జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

వంటల్లో నూనె తగ్గించుకోవాలి. గుండె బలంగా ఉండాలంటే మనం కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. నూనె, ఉప్పు ఎంత తగ్గిస్తే మనకు అంత లాభం. ప్రాణాయామం, యోగా ఒత్తిడిని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అందుకే మన వంటల్లో యాలకుల వినియోగం కూడా పెంచుకోవాలి. వాటితో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.