Hyderabad Biryani : హైదరాబాద్ అంటే ఒకప్పుడు కడక్ చాయ్, ఉస్మానియా బిస్కెట్ గుర్తుకు వచ్చేవి.. ఇప్పుడు ఆ స్థానాన్ని బిర్యాని ఆక్రమించింది. ఆక్రమించడం మాత్రమే కాదు ఏకంగా హైదరాబాద్ నగరాన్ని రాజధానిని చేసేసింది. వెజ్, చికెన్ అని తేడా లేకుండా హైదరాబాద్ నగరవాసులు లొట్టలు వేసుకుని బిర్యాని తిన్నారు. ఇక హోటళ్లకు వెళ్లడని వారు ఆన్లైన్ ఫుడ్ యాప్స్ ద్వారా నేరుగా ఇంటికే తెప్పించుకున్నారు.
స్విగ్గి ఆర్డర్స్ ప్రకారం
హైదరాబాద్ నగర వాసులకు ఆన్లైన్ ద్వారా ఫుడ్ సప్లై చేసే స్విగ్గి తనకు వచ్చే ఆర్డర్ల ప్రకారం ఎవరు ఏం తింటున్నారో ఇటీవల కొన్ని వివరాలు వెల్లడించింది. ఆ సంస్థ వివరించిన ప్రకారం గత ఆరు నెలల్లో 72 లక్షల బిర్యానీలు ఆర్డర్ వచ్చాయి. అంతటి కరోనా కాలంలో నాటి రికార్డును గత ఆరు నెలల్లో హైదరాబాద్ నగరవాసులు బ్రేక్ చేయడం విశేషం. ముఖ్యంగా కూకట్పల్లి, మాదాపూర్, అమీర్పేట్, బంజారా హిల్స్, కొత్తపేట, దిల్ షుక్ నగర్ ప్రాంతాల నుంచి ఈ ఆర్డర్లు ఎక్కువ రావడం విశేషం.. ఈ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు మాత్రమే కాకుండా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ పొందే అభ్యర్థులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వీరే తమకు బిర్యాని ఆర్డర్లు ఎక్కువగా పెట్టారని స్విగ్గి చెబుతోంది. గతంలో చికెన్ బిర్యానీ మాత్రమే ఎక్కువగా ఆర్డర్ పెట్టేవారని, ప్రస్తుతానికి అయితే అన్ని రకాల బిర్యానీలు ఆర్డర్ చేస్తున్నారని స్విగ్గీ చెప్తోంది. గతంలో గతంలో వారాంతాల్లో మాత్రమే బిర్యానీలు ఎక్కువగా ఆర్డర్ వచ్చేవని, ఇప్పుడయితే ప్రతిరోజు బిర్యానీలు ఆర్డర్ అవుతున్నాయని స్విగ్గి చెబుతోంది.
గతంలో బిర్యాని తినాలంటే చాలామంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావర్చి, మెహిఫిల్, ప్యారడైజ్, షా అండ్ గౌస్, పిస్తా హౌస్ లాంటి ప్రాంతాలకు వెళ్లేవారు.. ఫుడ్ యాప్స్ వచ్చిన తర్వాత చాలా మందిలో మార్పు వచ్చింది. కొత్త కొత్త హోటల్లు హైదరాబాదులో ఏర్పాటు అవుతుండడం, రకరకాల బిర్యానీలు అందుబాటులో ఉంటుండడంతో జనం జనం కొత్తదనాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే బిర్యానీలను లొట్టలు వేసుకుంటూ తినడం ప్రారంభించారు. హోటల్ ,యాప్ అని తేడా లేకుండా కుమ్మడం మొదలుపెట్టారు. కేవలం స్విగ్గి యాప్ ద్వారా 72 లక్షల బిర్యానీలు ఆర్డర్లు వచ్చాయంటే.. జోమాటో, అమెజాన్ ద్వారా ఎంత జరిగాయో ఊహించుకోవచ్చు. ఇక నేరుగా హోటల్స్ ద్వారా విక్రయాలయితే ఇంతకుమించి ఉంటాయని స్విగ్గి చెబుతోంది. అంటే ఈ లెక్కన హైదరాబాద్ వాసులు కేవలం కేవలం బిర్యాని మాత్రమే ఇష్టపడుతున్నారని అర్థమవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆర్డర్లు మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.