Homeహెల్త్‌Walking After Eating: భోజనం చేసిన వెంటనే నడుస్తున్నారా?

Walking After Eating: భోజనం చేసిన వెంటనే నడుస్తున్నారా?

Walking After Eating: ప్రస్తుత కాలంలో ఉద్యోగం, వ్యాపారం కారణంగా అనేక రకాల ఒత్తిడితో కలిగి ఉంటున్నారు. ఎక్కువమంది శారీరక శ్రమ కంటే మానసికంగా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కూర్చొని పనిచేసే వారు ఎక్కువగా ఉన్నారు. అయితే వీరు ఎక్కువ నడవలేక.. జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆరోగ్యం పై అవగాహన కూడా పెరుగుతుంది. చాలామంది వ్యాయామం దినచర్యగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉదయం లేవగానే వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అయితే ఉదయం తో పాటు రాత్రి భోజనం తిన్న తర్వాత కూడా వాకింగ్ చేయాలని అంటున్నారు. దీనిని Fordwalk అని కూడా అంటారు. అసలు రాత్రి భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

కొంతమంది చిన్న వయసులోనే గుండెపోటులు వచ్చి అకాల మరణం చెందుతున్నారు. మరికొందరు 40 ఏళ్లు నిండక ముందే ముసలివారీగా కనిపిస్తున్నారు. ఇందుకు కారణం శారీరకంగా ఎక్కువగా శ్రమ లేకపోవడమే అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కంప్యూటర్ల ముందు లేదా కూర్చొని ఎక్కువగా పని చేసేవారు రక్త ప్రసరణ మెరుగ్గా లేకుండా ఇలాంటి సమస్యలు తయారవుతాయి. అందువల్ల ఉదయం తో పాటు రాత్రి కూడా కాస్త వాకింగ్ చేయాలని అంటున్నారు.

రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం రెండు నిమిషాల పాటు సాధారణ వాకింగ్ చేయాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ సక్రమంగా ఉండి కడుపులో ఉండే గ్యాస్ బయటకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా భోజనం చేసిన తర్వాత ఇలా నడవడం వల్ల మలబద్ధక సమస్య ఉండదు. ఇక టైప్ టు డయాబెటిస్ నుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి వాకింగ్ తప్పనిసరిగా చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

అయితే ఈ ట్రెండు ఇప్పటికే విదేశాల్లో ప్రారంభమైంది. దీనిని ఫోర్డ్ వాక్ అని పిలుస్తారు. రాత్రి భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా కొందరు విదేశీయులు రెండు నిమిషాల పాటు వాకింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పేరు చలనచీలత పెరిగి పేగుల్లో ఉండే ఆహారాన్ని జీర్ణ క్రియ వైపు తొందరగా పంపుతుందని అంటున్నారు. అంతేకాకుండా రక్తంలోని చక్కర స్థాయిలను నివారించడం లేదా 24 గంటల వరకు ఇన్సూరెన్స్ సమస్య ఏర్పడకుండా కాపాడుకోవచ్చని అంటున్నారు. ఇంకా కొందరు అమెరికన్ వైద్యులు తెలుపుతున్న ప్రకారం భోజనం చేసిన తర్వాత ఇలా నడవడం వల్ల అత్యంత ప్రభావితవంతంగా ఉంటుందని చేర్చారు. అయితే ఈ నడకను ఆలస్యంగా చేయొద్దని.. తిన్న వెంటనే చేయడం ద్వారా పోషకాలు రక్తంలో కలిసిపోకుండా ఉంటాయని అంటున్నారు. అలాగే గ్లూకోస్ లెవెల్స్ పెరిగిపోతాయని పేర్కొంటున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు తిన్న వెంటనే వాకింగ్ చేయడం మంచిది అని పేర్కొంటున్నారు.

చాలామంది తిన్న తర్వాత శారీరక శ్రమ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి కంటే కూర్చొని పని చేసేవారు తిన్న వెంటనే నడవడం వల్ల ఎంతో ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంటున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు భోజనం చేసిన వెంటనే నడకను చేయండి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version