Benefits Of Molathadu: భారతదేశంలో కొందరు పెద్దలు చెప్పిన పద్ధతులు ఆరోగ్యకరమైన వేనని నేటి వారు చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వీటిని పట్టించుకోరు. ఒకప్పుడు ఇప్పుడు ఉన్న సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో అప్పుడు ఉన్న వస్తువులు, అవకాశాలను బట్టి కొన్ని పద్ధతులను నిర్ణయించారు. ఇవి మనుషుల ఆరోగ్యానికి, అవసరానికి ఎంతో ఉపయోగపడేవి. అయితే కాలక్రమమైన వీటిని కొందరు పాటిస్తున్నా.. మరికొందరు మాత్రం నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇలాంటి వాటిలో మొలతాడు ఒకటి. చిన్నపిల్లల నుంచే మొల తాడు కట్టుకోవడం అలవాటు చేపిస్తారు. ఎక్కువ శాతం మగవారికి మాత్రమే మొలతాడు ఉంటుంది. కానీ కొన్ని ప్రదేశాల్లో ఆడవారు కూడా దీనిని ధరిస్తున్నారు. మొలతాడు ధరించడం వెనుక అనేక శాస్త్రీయ, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే దీనిని తప్పక ధరిస్తారు. అవేంటంటే?
మానవ శరీరం అనేక అవయవాలతో కలిగి ఉంది. ఇందులో ఒక్కో ప్రదేశం ఒక్కోరకంగా ఉంటుంది. మానవ శరీరంలో ప్రధానంగా నడుమును చూస్తారు. ఈ ప్రదేశం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతారు. నడుములో ఉండే అవయవాలు సక్రమంగా ఉండడానికి.. వీటిని సరి చేయడానికి ఒకప్పుడు మొలతాడును ధరించేవారు. దీనిని ధరించడం వల్ల ఇక్కడున్న అవయవాలు సక్రమంగా పనిచేసే అవకాశం ఉంది.
Also Read: ఏముందిరా మావా.. ఏజు పెరిగినా అమ్మడు అందం మాత్రం తగ్గలేదుగా!
ప్రస్తుత కాలంలో ఆహారం ఎంత తింటున్నామో మనుషులకు తెలియడం లేదు. ఒకప్పుడు కూడా కొందరు అలాగే చేశారు. అయితే మితమైన ఆహారమే ఆరోగ్యకరమని అప్పుడే గుర్తించారు. విధంగా ఆహారం తీసుకునేందుకు నడుము చుట్టూ మొలతాడును ధరించేవారు. ఈ మొలతాడు ఉండడం వల్ల ఆహారం ఎక్కువ అయినా కొద్దీ టైట్ గా మారేది. దీంతో ఆహారాన్ని తగ్గించేవారు. ఇలా మొలతాడు ఆరోగ్యకరంగా ఉపయోగపడేది.
హిందూ శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి శరీరంపై ఎలాంటి నూలు పోగు లేకుండా ఉండరాదు. ఒక్కోసారి స్నానం చేసిన సమయంలో మొత్తం వస్త్రాలు తీసేసినా.. మొలతాడు ఉంటుంది. ఇది కూడా ఒక వస్త్రం మాదిరిగానే ఉంటుంది. దీంతో శాస్త్రాన్ని పాటించే క్రమంలో మొలతాడును ధరించాలని నిర్ణయించారు.
ఇప్పుడు జీన్స్, ఇతర ట్రోజర్స్ ధరించేవారు అవి బిగుతుగా ఉండేందుకు బెల్టులు ధరిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇవి అందుబాటులో లేవు. అంతేకాకుండా పాతకాలంలో ఎక్కువగా లంగోటీలు ధరించేవారు. ఇవి జారిపోకుండా ఉండడానికి మొలతాడును ఉపయోగించేవారు. అందుకే దీనిని ఇండియన్ బెల్ట్ అని కూడా అంటారు. ఇప్పటి కాలంలో కూడా కొందరు బెల్టును ధరించిన కూడా.. మొలతాడును వేసుకోవడం వల్ల నడుం సక్రమంగా ఉంటుంది.
Also Read: అబ్బాయిలు చెవి కుట్టించుకుంటే బెటరా? కాదా? ఏది నిజం?
మొలతాడు ఉండడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఏవైనా కీటకాలు కుట్టినప్పుడు.. లేదా పాము కరిచినప్పుడు విషం శరీరంలోకి వెంటనే వెళ్లకుండా మొలతాడును తీసి కట్టు కట్టేవారు. అయితే ఆ తర్వాత మరో మొలతాడును ధరించేవారు.
ఇలా పలు రకాలుగా మొలతాడు ఉపయోగపడటం వల్ల దీనిని పెద్దలు తప్పనిసరిగా చేశారు. చిన్నపిల్లల నుంచే మొలతాడును వాడాలని చెబుతూ వస్తున్నారు. ఒకప్పుడు కేవలం మగవారు మాత్రమే దీనిని ధరించేవారు. కానీ ఇప్పుడు ఆడవారు కూడా ధరిస్తున్నారు.