Cloves: లవంగం నోట్లో వేసుకుంటే ఎంత లాభమో తెలుసా?

Cloves: ఓ సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం ఓ డైలాగ్ చెబుతాడు. బుల్లెట్ చూడ్డానికి ఇంతే ఉంటుంది కానీ దిగితే తెలుస్తుంది దాని బలం అని. అలాగే లవంగం కూడా చూడ్డానికి ఇంతే ఉంటుంది. కానీ దాని ఘాటు బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఆరోగ్య పరిరక్షణలో దాని ఉపయోగం ఎంతో ఉంటుంది. ఈ విషయం తెలియని వారు చాలా మంది ఉన్నారు. అందుకే దాని విలువ గురించి తెలిస్తే ఆశ్చర్యమే. వంటల్లో రుచి, వాసన రావాలంటే వాటిని వాడాల్సిందే. […]

Written By: Srinivas, Updated On : March 15, 2023 5:46 pm
Follow us on

Cloves: ఓ సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం ఓ డైలాగ్ చెబుతాడు. బుల్లెట్ చూడ్డానికి ఇంతే ఉంటుంది కానీ దిగితే తెలుస్తుంది దాని బలం అని. అలాగే లవంగం కూడా చూడ్డానికి ఇంతే ఉంటుంది. కానీ దాని ఘాటు బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఆరోగ్య పరిరక్షణలో దాని ఉపయోగం ఎంతో ఉంటుంది. ఈ విషయం తెలియని వారు చాలా మంది ఉన్నారు. అందుకే దాని విలువ గురించి తెలిస్తే ఆశ్చర్యమే. వంటల్లో రుచి, వాసన రావాలంటే వాటిని వాడాల్సిందే. లవంగాల పొడి వేస్తే కూరలో టేస్ట్ వేరేగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వరల్ గుణాలు పుష్కలంగా ఉండటంతో ఇవి మన శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఎంతో సాయపడతాయి.

లవంగాల్లో పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి మినరల్స్, విటమిన్లు దాగి ఉన్నాయి. రోజు ఉదయం పరగడుపున లవంగాలను నోట్లో వేసుకుంటే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. దీంతో జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. జుట్టు నల్లగా అయ్యే అవకాశం ఉంది. రక్తహీనత సమస్య కూడా పరిష్కారమవుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు సైతం రాత్రి సమయంలో ఒక లవంగం నోట్లో వేసుకుని తినడం వల్ల ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పట్టేందుకు మార్గం కనిపిస్తుంది. దంతాల నొప్పులు మటుమాయం అవుతాయి. పళ్లు పుచ్చిపోకుండా కూడా ఇవి తోడ్పడతాయి. నోరు దుర్వాసన రాకుండా చేస్తాయి.

లవంగాలను తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అధిక బరువు సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం సమస్యల నుంచి దూరం కావచ్చు. ఎముకల దృఢత్వానికి కూడా సాయపడుతుంది. లవంగాలను పరగడుపున చప్పరిస్తూ ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు సమాధానం చెప్పొచ్చు. ఇలా లవంగాల వినియోగంలో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగి ఉండటంతో వీటిని తరచుగా తీసుకోవడం వల్ల మన అనారోగ్య సమస్యలు లేకుండా పోతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

లవంగాల వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల ఇవి మన శరీరానికి ప్రయోజనం కలిగిస్తాయి. రుచి కోసమే కాకుండా మన దేహానికి అవసరమయ్యే ఎన్నో గుణాలు ఇందులో ఉన్నాయి. సుగంధ ద్రవ్యాల్లో లవంగాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే వీటిని తరచుగా వంటల్లో వాడుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. రోజుకో లవంగాన్ని నోట్లో వేసుకుని చప్పరించినా దాని వల్ల మనకు ఆరోగ్యం కుదుట పడేలా చేస్తుందని నిపుణుల అభిప్రాయం.