Disposable Glass : టీ, కాఫీ అంటే కొందరికి ప్రాణం. అసలు దీన్ని తాగకపోతే కొందరికి రోజూ కూడా గడవదు. సాధారణంగా ఎవరికైనా సూర్యోదయంతో డే స్టార్ట్ అయితే.. కొందరికి మాత్రం వీటితోనే స్టార్ట్ అవుతుంది. అసలు రోజులో ఎన్నిసార్లు తాగుతారో లెక్క కూడా ఉండదు. అయితే కొందరు ఇంట్లో టీ చేసుకుని తాగితే.. మరికొందరు బయట తాగుతుంటారు. ఇంట్లో చేసిన కాఫీ లేదా టీ తాగితే వారు స్పెషల్ గ్లాస్‌లో వేసుకుని తాగుతారు. అదే బయట అనుకో పేపర్ గ్లాసులు (Disposable Glass) ఉంటాయి. గాజు గ్లాసులు ఉంటాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. ఎందుకంటే వీటిని వాడిన తర్వాత క్లీన్ చేయాలి. దీని కంటే వాడి పడేసినవి బెటర్ అని చాలా మంది పేపర్ గ్లాసులు వాడుతుంటారు. అయితే ఈ పేపర్ గ్లాసుల్లో కాఫీ, టీ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని రసాయనాలు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అయితే డైలీ మీరు బయట ఇలాంటి ప్లాస్టిక్ గ్లాస్‌లో కాఫీ, టీ లేదా పాలు వంటివి తాగుతున్నారా.. అయితే ఈ స్టోరీ మీ కోసమే.
ఏ సీజన్ అయినా కూడా చాలా మంది ఏదో ఒకటి బయట తాగుతుంటారు. కేవలం టీ, కాఫీ అనే కాకుండా జ్యూస్‌లు వంటివి కూడా డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో తాగుతారు. ఇవి పేపర్ అని వాడి పడేస్తే ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదని భావిస్తారు. కానీ వీటి వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు ఉన్నాయని గుర్తించరు. ఎందుకంటే కాగితపు కప్పులను తయారు చేయడానికి అనేక రకాల రసాయనాలు, ప్లాస్టిక్‌లను ఉపయోగిస్తారు. ఇవి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వీటిలో ఎక్కువగా మైక్రో ప్లాస్టిక్‌లు ఉపయోగిస్తారు. వీటిని వాడటం వల్ల అందులోని రసాయనాలు అనారోగ్యం బారిన పడేలా చేస్తాయి. మీకు ఆ కప్పుల్లో కాఫీ లేదా వేడి నీళ్ల వంటివి ఏవైనా వేడి పానీయాలు వేస్తే.. మైక్రోప్లాస్టిక్ చిన్న కణాలుగా బయటకు వస్తుంది. ఇవి శరీర ఆరోగ్యా్న్ని దెబ్బ తీస్తాయి.
ఒక పేపర్ కప్పులో ఏదైనా వేడి పానీయం వేసి దాదాపుగా 15 నిమిషాల పాటు ఉంచితే తప్పకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి. కేవలం ఈ 15 నిమిషాల్లోనే 20,000 నుంచి 25,000 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశించి హార్మోన్ల అసమతుల్యత, ప్రమాదకరమైన క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ కప్‌లను ఎక్కువగా వాడవద్దు. వీటికి బదులు పింగాణీ లేదా స్టెయిన్ లెస్ స్టీల్ కప్పులను ఉపయోగించడం బెటర్. డైలీ కాఫీ తాగితే గాజు, స్టీల్ వంటివి ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోనివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.