https://oktelugu.com/

Bank of Baroda Jobs 2022: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

Bank of Baroda Jobs 2022: బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 10 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇంటర్నల్ అంబుడ్స్‌మన్, ప్రొడక్ట్ హెడ్ ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్ మేనేజర్, ఫ్యాకల్టీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 21, 2022 / 01:39 PM IST
    Follow us on

    Bank of Baroda Jobs 2022: బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 10 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇంటర్నల్ అంబుడ్స్‌మన్, ప్రొడక్ట్ హెడ్ ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్ మేనేజర్, ఫ్యాకల్టీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    Bank of Baroda Jobs 2022

    ఆఫీస్ అసిస్టెంట్, బిజినెస్ కరస్పాండెంట్, సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీలు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వాళ్లు మాత్రమే ప్రాడక్ట్ హెడ్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బీఈ, బీటెక్, ఎంసీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతను కలిగి ఉంటారు.

    Also Read: “కలియుగ కర్ణుడు” సోనూసూద్‌ పై కేసు నమోదు

    ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2022 సంవత్సరం మార్చి 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ ద్వారానే ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

    Also Read: బీజేపీ చూపు ముద్రగడ వైపు.. పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు?
    Recommended Video: